మాతృ భాష
మాతృ భాష మనకు..
కన్న తల్లి వలె వెలుగు..
శతాబ్దాల భాష తెలుగు..
సాహిత్యంతో అది వెలుగు..
కావ్యాలెన్నో రాసే..
కవులింట అది నిలుచు..
భాషలెన్నో నేర్చిన..
సాటి రాదు తెలుగుకు..
మమ్మి డాడీ మాట మరిచి..
అమ్మా నాన్న మాట నిలుపు..
భాషలందు తెలుగు బాష..
అని లెస్స పలుకు..
కన్న తల్లి ఆశ తీర్చు..
తెలుగు తల్లిని ఇంట చేర్చు..
నమస్కారముతో..
సంస్కారము చూపించు..
దేవతల భాష సంస్కృతం..
నుండి వచ్చిన తెలుగును గుర్తించు..
నాటి భాష నేటికి..
తరతరాలకు వినిపించు..
తెలుగు భాషా దినోత్సవ..
శుభాకాంక్షలు అందరికీ..
జై తెలుగు తల్లీ..
జై జై తెలుగు భాషా..
-ఉమాదేవి ఎర్రం