మత మార్పిడి
వికాస్ ఫర్జాన ఓ శుభముహూర్తాన ఒకరినొకరు చూసుకున్నారు..కళ్లూ కళ్లూ కలిసాయి కళ్లతోనె వేల మాటలు మాట్లాడుకున్నారు..ఒకరి కొకరు నచ్చారు..ఇంకేముంది?కలుసుకోవడం ప్రారంభించారు ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చు కున్నారు..ఫోన్ లో మాటలే! కలుసుకున్నప్పుడూ మాటలే!ఇళ్లల్లో ఎవరికీ తెలియదు వీల్ల వేషాలు..ఒకరోజు గప్ చుప్ గా వెళ్లి గుళ్లో పెళ్లి చేసుకున్నారుఅయితే చేసుకునే ముందే ఒకరి కొకరు చెప్పుకున్నారుఎవరి పండుగలు అయినా ఇద్దరం చేసుకోవాలని..తప్పకుండా జరుపు కుందాం! అనుకున్నారు..మా వంటలు నువ్వు నేర్చుకో! మీ వంటలు నేనూ నేర్చుకుంటా! అన్నాడు వికాస్..సరే అంది ఫర్జాన..అలాగె మనకు పిల్లలు పుట్టాక మా దేవుడి పేరొకరికిమీ దేవుడి పేరొకరికి పెట్టుకుందాం! అనుకున్నారు.ఓ రెండు సంవత్సరాలు బాగానె ఉన్నారు కానీ తరువాత చాలా కష్టమయింది..ఎందుకంటె..మత మార్పిడి అంత ఈజీ కాదు కదా!బొంబాయి సినిమా చూసినట్టున్నారు పాపం ఫాలోఅయ్యారు..కానీ అది ఓ మూడు గంటల సినిమా!ఇది నిజ జీవితం..వికాస్ కి దేవుళ్లు ఎక్కువ అన్ని పండుగలు చేయాలంటె ఫర్జానతో కావడం లేదు..వికాస్ కి కూడా బక్రీద్ చేసి మేకను కోసి పంచి పెట్టాలనేది రంజాన్ అయితే సేమియా పంచాలనేది ఫర్జాన తనవల్ల కూడా కావడం లేదు..ఇద్దరూ ఎవరింటికి ఎవరూ వెళ్లక విడి కాపురం తో డబ్బులు సరిపోక పోవును..
రెండు మతాల పండుగలు చేసుకోలేక నానా ఇబ్బందిపడ్డారు..ఇంకానయం పిల్లలు పుట్టలేదు..రెండు సంవత్సరాలకే ఇద్దరికీ ఈ జీవితం నచ్చ లేదుఎవరింటికి వాల్లు వెళ్లిపోయారు..కులాలు ఛేంజ్ అయితేనె కష్టమంటె ఇక మతాలంటెఎంత కష్టమెా అర్థమయి ఎవరి మతాన్ని వాళ్లే గౌరవిద్దామనుకున్నారు..
జన్మకింతే! అని సరిపెట్టుకున్నారు..
నేనేదో సరదాకి రాసాను..
ఎవరినీ బాధ పెట్టాలని కాదు..
-ఉమాదేవి ఎర్రం