మాట సహాయం
ఆర్ధిక సహాయం చేయలేనప్పుడు కనీసం మాట సహాయం చేయడంమంచిది. వెంకట్రావు ఒక చిన్న కంపెనీలో ఉద్యోగి.గొర్రెకు బెత్తెడే తోక అన్నట్లుఅతనికి అంతంతమాత్రంగానేజీతం వస్తుంది.
ఆ జీతం అతనికుటుంబ పోషణకే సరిపోదు.వెంకట్రావుకి సంఘ సేవ చేయాలి అనే కోరిక బలంగా
ఉంది.
సంఘ సేవ చేయాలంటేఎంతోకొంత డబ్బులు కావాలి.వెంకట్రావుకి లేనిదే డబ్బు.సంఘ సేవ చేయలేక పోతున్నాను అనే బాధ అతనిమనసులో ఉంది. అప్పుడువెంకట్రావు మితృడు రవివెంకట్రావుతో “నువ్వు సంఘసేవ చేయాలని అనుకుంటూఉన్నావు.
అయితే నీ వద్దధనం లేకపోవడంతో నువ్వుఆ పని చేయలేక పోతున్నావు.అప్పుడు నువ్వు ఏమాత్రం బాధపడవలసిన అవసరంలేదు.
నువ్వు ఇతరులకుమాట సహాయం చెయ్యవచ్చు.కష్టంలో ఉన్నవారికి ధైర్యచనాలు చెప్పవచ్చు. అలాగే
డిప్రెషన్లో ఉన్నవారి మనసుకు ఉత్సాహం కలిగించవచ్చు.
నీపలుకుబడి ఉపయోగించిసమర్ధులకు ఉద్యోగం ఇప్పించవచ్చు” అన్నాడు. ఆ సలహావెంకట్రావుకి నచ్చింది.
ఆ రోజునుండి తనకు ఖాళీ ఉన్న సమయంలో ఇతరులకు మాట సహాయం చేసి తృప్తి
పొందుతున్నాడు.
-వెంకట భానుప్రసాద్ చలసాని