మరుపు
దినకరుని వెలుగు కిరణాలు
దేదీప్యమానమైన కాంతిని..
వెదజల్లుతున్నప్పుడు..
పగటి వెలుగుల ఉజ్వల కాంతులను..
ఉబలాటంగా ఆస్వాదిస్తూ..
అవే శాశ్వతం అనే భ్రమలో
రాబోయే చీకటిని విస్మరించాను..!
క్రమక్రమంగా కరిమబ్బులు…
కమ్ముకుంటున్న సమయంలో..
ఇప్పుడు.. రాత్రి పొద్దు పోయాక…
హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది..!
నేను నా జీవితమనే గృహాన్ని…
సర్దుకోవడమే మరిచిపోయానని..!
– మామిడాల శైలజ