మార్పు
మార్పు నేనున్నానని కాలం రూపంలో చెబుతుంది.
మార్పు సహజం అనుకుంటే
ముందుంటుంది.
మార్పు ఆస్వాదిస్తూ వుంటే
అనుభమవుతుంది.
మార్పు అనుకరిస్తూ వుంటే
అభివృద్ధి అవుతుంది.
మార్పును వ్యతిరేకిస్తూ వుంటే ఫలితం తక్కువగా వుంటుంది.
మార్పు నిషేధిస్తే ప్రతిఫలం శూన్యం.
మార్పు అతిక్రమిస్తే శాసిస్తుంది.
మార్పును అభినందిస్తూ వుంటే నిన్నే చూస్తుంది
మార్పు అధికం ఇస్తుంటే విజయం నీదే అవుతుంది.
మార్పుని కూర్పు చేస్తే ఆధారమవుతుంది
మార్పు చెరుపు చేస్తే వక్రీకరిస్తుందని అంటారు.
మార్పు వదిలేస్తే తీర్పు అవుతుంది.
మార్పు అనుభవిస్తే అమితానందాన్ని ఇస్తుంది
ఇదే ఇదే మార్పు తీర్పు.
– జి.జయ