మార్మికానికి ద్వారమై

మార్మికానికి ద్వారమై

ఏకాంతాల స్వచ్ఛతలో క్షణమొక
నూతన పరిచయాలతో ఆంతరంగిక
నిర్మాణమై…చూచిన మధిలో
మరిచిపోలేని శాశ్వతను ముద్రించుకొంటు
మనస్సున మనస్సు మార్మికానిక ద్వారమై
నీవన్నది లోకాన వెచ్చబడాలని కోరుతు…

అలుపన్నది జీవితాన్ని కొలువక…
కరిగిన మనస్సు జలపాతంలో తడిసిన
భావాలను కవితలుగా రాసుకొంటు
పద మడిగిన రూపానికి ముఖం తెల్లబోక
నాకంట మెరిసిన మెరుపువు నీవేనని…
నీ రూపపు ప్రాధేయాన్ని వసంతాల
పూర్ణమగా పూయించుకోవాలని…

పలకని ఆకాశపు బొమ్మ పిలుపులను
పంచుతు…గగనపు నుదిటికి తిలకమై
ఒలికిన వయ్యారాలను పిల్లగాలుల
తెమ్మరలుగా కదిలిస్తు…చలువల దేహాన్ని
నాలుకలపై మెలిదిప్పుతు హాయిని గొలిపిన
మనస్సున మనస్సు కొత్త లోకపు విహారంతో
వేడుకల ప్రణయ గీతాలను పాడిస్తున్నది…

ఆకారాల మేఘపు మీగడలను చిలికిన
కవ్వమై…వాలు జడన కట్టిన జడగంటల
నాదాన్ని ఎంకి పాటల సొంపుగా వింటు
క్షణ క్షణం ఆచరణల విలాసాన్ని చితికిన
బతుకులను కూర్చిన నీ మనస్సు కు
సమర్పిస్తు…ప్రతి మనస్సున మనస్సు
దేహపు పంటగా విరబూయాలని…

 

-దేరంగుల-భైరవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *