మనుషులు
అవసరాలకే పరిమితమైన బంధాలు..
బంధాల గొలుసులో చిక్కుకున్న జనాలు..
జనాల జాలిలేని జల్లెడ హృదయాలు..
హృదయాల స్పందనలు ఆగిపోయే ఆగడాలు..
ఆగడాలకు మానవత్వ మనుగడ మాయమయ్యే పోకడలు..
పోకడల మాటున దాగిన నిగ్గుదేలని సిగ్గులేని నిజాలు..
నిజాల నిప్పుకణికలను ఆర్పేయాలని చూస్తున్న అమాయకపు లోకులు..
లోకుల ప్రలోభాలకు కాకుల్లా మారుతున్న మతిలేని సమాజాలు..
సమాజాల అసమర్ధతకు చతికిల పడిపోతున్న సామాన్య బతుకులు..
బతుకుల అతుకులలో నిమగ్నమైన మహా మనుషులు.
– శంభుని సంధ్య