మనుషులు
1. ఆ.వె.
మనిషి తిరుగుచు గనె మహిలోన వింతలు
మనిషి మేథతోటి మార్పు జేసె
అవని వింతలు మార్చి ఆనందపడుచుండె
ముప్పు ఎరుగడాయె ముందు ముందు
2. ఆ.వె.
పంచభూతములను పట్టి ఆడించుచూ
మనిషికున్న గొప్ప మహిమ చాటె
జీవరాశియందు చిన్నదేహమువాడు
మేథయందు జగతి మేలుకొలుపు
3. ఆ.వె.
నాటిమనుషులంత సాటిమనిషితోటి
ఐకమత్యముండి ఆదరించె
నేటిమనుషులంత సాటివాన్నేదోచి
ఏమి ఎరుగనట్లు ఏడ్చుచుండె
4. ఆ.వె.
ముందు మాటవిన పసందుగా నుండును
వెనుకగోయి తీసి వెన్నుపొడుచు
బంధువులనువారు బద్ధశత్రువులాయె
ఎవరు మంచివారొ ఎరుగలేము
– కోట