మనుషులమేనా

మనుషులమేనా

ఆమె నడుస్తోంది పైన ఎర్రగా మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా పిల్లాడితో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఎటు వెళ్తున్నాను తెలియని స్థితిలో నడుస్తూ ఉంది రోడ్డుమీద.

ఆమె భర్త మొన్ననే చనిపోయాడు ఉన్న అత్తగారు మాత్రం మా కొడుకే చనిపోయిన తర్వాత ఇక నీతో మాకు అవసరం లేదు అంటూ ఇంటి నుంచి గెంటి వేశారు. ఇప్పుడు ఆమెకు నిలువ నీడ లేకుండా పోయింది తను ఎక్కడికి వెళుతున్నాను తెలియని స్థితిలో పిల్లాడితో పాటు ముందుకు కదులుతోంది.

మొన్నటి వరకు భర్త కొడుకుతో సంతోషంగా గడిపిన జీవితం కాకపోతే మొగుడు మందుకు బానిస అనుకోకుండా చనిపోయాడు అంతటితో ఆమె జీవితం అగాధంలోకి జారిపోయింది.

తాగి చనిపోయిన వాడి భార్య అంటూ చుట్టుపక్కల వాళ్ళు భరించలేక అత్తగారి ఆశ్రయం కోరింది అయినా అత్తగారు మామగారు ఆమెను పట్టించుకోకుండా నా కొడుకును నువ్వే చంపేసావు అంటూ నింద వేసి మరీ వెళ్లగొట్టారు.

ఆమె పుట్టింటి వాళ్ళు లేరు సంవత్సరం క్రితం వాళ్ళిద్దరూ ఒక పెళ్ళికి వెళ్లి వస్తుండగా చనిపోయారు. అన్న, చెల్లెలు, అక్క, తమ్ముడు ఆమెకు ఎవరూ లేరు. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు ఎక్కడికి వెళ్లాలని ఆలోచన ఆమెకు లేదు. కానీ ఏదైనా దారి దొరుకుతుందేమో ఏదైనా పని దొరుకుతుందేమోనని ఆమె ఆశ. 

మిట్టమధ్యాహ్నం ఆ రోడ్డు పైన ఎవరూ లేరు అప్పటివరకు పొలాల్లో పని చేసుకునే వాళ్ళు ఎండ ఎక్కువ కావడంతో తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఒక్క పిట్ట పొరుగు కూడా కనిపించడం లేదు కనీసం కాకి అరుపులు కూడా వినిపించడం లేదు.

అయినా ఆమె ఆగకుండా తన కొడుకు ఆకలి తీర్చడానికి వెళ్తుంది. ఆమె అన్నం తిని రెండు రోజులైంది పిల్లాడికి పాలు రావడం లేదు పిల్లాడికి పాలు రావాలంటే కనీసం ఏదో ఒకటి కచ్చితంగా తినాలి. అందుకోసమే చిన్న పనైనా చేయడానికి సిద్ధంగా ఉంది.

సరిగ్గా అదే సమయంలో ఆ రోడ్డు మీద దూరంగా బైక్ సౌండ్ వినిపించింది. ఆ బైక్ మీద వచ్చే వారిని ఏదైనా సహాయం అడగాలి అని అనుకుంది ఆమె.

బైకు దగ్గరికి వచ్చే వరకు వేచి చూసింది కొంచెం చెట్టు పక్కనే ఉన్న చెట్టు నీడలో నిలబడి సైగ చేసింది. ఆ బండి పై ఉన్న ముగ్గురు అప్పుడే పార్టీ చేసుకొని బాగా తాగి మత్తులో తూలుతూ ఉన్నారు.

బండి ఆపిన వాళ్ళు ఆమె ఇంకెందుకు పిలుస్తుంది అని అనుకున్నారు దగ్గరికి వచ్చి ఏంటి అని అడిగారు రెండు రోజులుగా నా బిడ్డకు పాలు లేవు నా భర్త చనిపోయాడు నాకు ఏదైనా సహాయం చేయండి. నేను నా ఆకలి తీరితే తప్ప పిల్లాడికి పాలు రావు కాబట్టి నాకు ఎంతో కొంత సహాయం చేయండి అని అడిగింది.

మనుషుల్లో జాలి, దయ ఉన్నవాళ్ళు ఉంటారని ఆమె ఇంకా నమ్ముతుంది కాబట్టి వాళ్ళని ఆ సహాయం అడిగింది కానీ తాగిన మత్తులో ఉన్న వాళ్లకు ఆమె కొట్టొచ్చినట్లుగా కనిపించింది.

దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఒకడు పిల్లాడిని లాక్కొని మీకు పంపిస్తాను రా అంటూ పక్కకి ఆమె చేయి పట్టుకొని వెళ్ళాడు నేను అలాంటి దాన్ని కాదు మీరు చేస్తే సహాయం చేయండి లేదంటే వెళ్లిపోండి కానీ నన్ను ఏమీ చేయకండి అంటూ ఆమె బ్రతిమాలింది.

కానీ ఆ కామాంధులు వినలేదు. దాంతో ఆమె వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తి తన బిడ్డను తీసుకుని రోడ్డు వైపు గా పరిగెత్తింది. ఆ ముగ్గురు ఆమె వెనకాల పడ్డారు కడుపులో ఆసరా లేకపోవడంతో బలహీనమైన శరీరం కాబట్టి ఆమె తొందరగానే వారికి దొరికింది.

మమ్మల్ని మోసం చేస్తావా ఈరోజు నీ పని చేసే చూపిస్తాం అంటూ ఒకరి తర్వాత ఒకరుగా ఆమెను అనుభవించారు.

రెండు రోజులుగా తిండి లేక పోవడం పైగా భర్త చనిపోయాడు అనే మానసిక బాధలో ఉన్న ఆమె చేసిన అరాచకానికి ప్రాణాలు విడిచింది. పిల్లాన్ని పక్కనే ఉంచి ఆ మిగిలిన ముగ్గురు తమ పని అయిపోగానే వాళ్ల బైక్ ఎక్కి వెళ్లిపోయారు.

ఆమె అలా పోయిన ప్రాణాలతో చెదిరిన చీరతో జాకెట్ మొత్తం నగ్నంగా మారి అలా రోడ్డుపై ఎండలో పడి ఉంది ఆ పిల్లాడు ఆకలికి ఏడుస్తూ ఉన్నాడు.

అలా సాయంత్రం వరకు ఆమె అలాగే పడి పోయి ఉంది చనిపోయిన ఆమెను చూస్తూ పిల్లాడు అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ లేపుతూ ఉన్నాడు కానీ ప్రాణం లేని ఆమె ఎలా పలుకుతుంది.

సాయంత్రం అయింది ఆ రోడ్డు మీద సందడి మొదలైంది ఎండలతో పిల్లల్లో అప్పటి వరకు ఉన్న జనాలు ఒక్కొక్కరుగా బయటకు రావడం మొదలైంది. లారీలు కార్లు బైకులు వెళ్తున్నాయి.

రోడ్డు పైన అడ్డంగా పడి ఉన్న ఆమెను చూసి అందరూ చుట్టూ మూగారు. అందరూ తమ ఫోన్లలో ఆమెను వీడియో చూస్తూ ఇది ఎలా జరిగింది ఉంటుంది వాడు రేప్ చేసి చంపేసి వెళ్ళిపోయి ఉంటాడు.

లేదా ధర సరిపోక డబ్బులు ఎక్కువ అడిగి ఉంటుంది అందుకే వాడు పనికానిచ్చి దాన్ని చంపేసి వెళ్ళిపోయి ఉంటాడు ఎలాగా ఉంది అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ తమ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.

కానీ ఒక్కరు కూడా నగ్నంగా ఉన్న ఆమె ఒంటి మీద బట్టలు లేవని కానీ లేదా పోలీసులకు సమాచారం అందించాలని కానీ ఎవరూ అనుకోలేదు.

ఆమె అందాలను చూస్తూ ఇంకా అబ్బా చాలా బాగుంది అందుకే దీన్ని రేప్ చేసి ఉంటారు. ఎత్తులు ఆ పొంగు చూడు ఎంత బాగున్నాయి పురుగులు ఆమెను అంగాంగ వర్ణనలు చేస్తూ వారిలో వారు మాట్లాడుకుంటున్నారు

ఇంతలో అటువైపుగా పోలీస్ జీప్ వచ్చింది ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అని సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి రావడం జరిగింది అక్కడ ఉన్నవారిని అందర్నీ చూసి ఏం జరిగింది అని అడిగారు.

ఏమో నాకు తెలియదు ఏమో నాకు తెలియదు అంటూ అప్పటి వరకు వీడియోలు తీసిన వారు అందరూ చల్లగా జారుకున్నారు.

చనిపోయిన ఆమె శివం చూసిన పోలీసులు వెంటనే ఆంబులెన్స్ కి ఫోన్ చేసి గుర్తు తెలియని మహిళ శవం గా నమోదు చేసుకున్నారు.

పిల్లాడి ఆకలి తీర్చాలని అనుకున్న ఆ తల్లి చేసింది తప్పా? నగ్నంగా ఉన్న ఒక ఆడదాని ఒంటి మీద బట్టలు లేని సమాజం అలా శవం పడి ఉన్నా చూస్తూ తమ ఫోన్లలో వీడియోలు తీస్తున్న సమాజానిది తప్ప?

ఉపాధి కోసం వలస వలసకు వెళుతూ తన కడుపు తన కొడుకు కడుపు నింపుకోవడానికి సహాయం అడిగిన ఆ మహిళ చేసిన తప్పా? వాళ్ళని పిలిచినా కూడా అత్యాచారం చేసి తప్పించుకున్న మూర్ఖులది తప్పా?

ఇది హైవే పైన జరిగిన సంఘటన. ప్రియాంక, మానస, నందిని, మౌనిక, హర్షిత, ఇలా పేర్లు ఏవైనా అందరూ ఆడపిల్లలే వారికి జరిగేది అన్యాయమే ఈ అన్యాయాన్ని ఎవరు ప్రశ్నించరు ఎవరు ముందుకు రారు.

చచ్చిపోయిన వారికి సాయం అందించారు అలాగే వాళ్ళకి కల్పించారు ప్రియాంక ని చంపిన వాళ్ళు వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చూపించారు కానీ ప్రతి రోజు జరుగుతున్న ఆగడాలను ఎవరు ఆపగలరు.

ఈ విషయం మీద నిన్న ట్విట్టర్లో నేను కొందరు తో మాట్లాడటం జరిగింది వాళ్ళంతా తమను తాము సమర్ధించుకున్నారు తప్ప అవును ఇది తప్ప వేరే వాళ్ళకి శిక్ష పడాలి అని ఏ ఒక్కరు కూడా నోటితో అనలేదు.

మనుషులంటే జాలి, దయ, కరుణ, మానవత్వం అనేవి ఉండాలి కానీ ఇవేవీ లేని సమాజంలో మనం బతుకుతున్నాం అనడానికి ఇదొక చిన్న నిదర్శనం మాత్రమే.

ప్రతి రోజూ ఎంతోమంది పసిమొగ్గలు నుంచి పండు ముదుసలి వరకు ఎంతో మంది అత్యాచారాలకు గురి అవుతున్నారు వాళ్ళకి న్యాయం జరగడం లేదు సమాజంలో వాళ్లని చిన్నచూపు చూస్తున్నారు చూడలేక సమాజమనే చుట్టుపక్కల వాళ్ళు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఇలా ఆత్మహత్యలు చేసుకోకుండా సమాజాన్ని మనం ఆపగలమా వారికి మనం న్యాయం చేయగలమా వారికి ఒక ఆసరా కల్పించగలరు.

ఒకవేళ ఆసరా కల్పించిన కల్పించడానికి ముందుకు వచ్చిన సంస్థలు కూడా చివరికి వారితో అదే వ్యభిచారం చేయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు అనేది నిజం కాదా.

మీరు ఎలాగో ఆ పని చేశారు కాబట్టి ఇక్కడ చేయడంలో తప్పులేదు అని పెద్ద పెద్ద వాళ్ల దగ్గరికి వాళ్ళని చాలా సంస్థలు వాళ్లతో పనులు చేయించుకుంటూ డబ్బులు దండుకుంటున్నారు అనేది నిజం కాదా?

ఇవన్నీ ప్రశ్నించడానికి ఎవరు ముందుకు వస్తారు వాళ్ళకి ఉన్నాయి మాకెందుకు అనుకుంటారు అది మానవ నైజం ప్రశ్నించే రోజు ఒకటి తొందరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఇలాంటి ఎందరో అతివలు మన చుట్టుపక్కలే ఉన్నారు కేవలం పేపర్లలో వచ్చే వార్తలు కాదు చుట్టుపక్కల ఇళ్ళలోకి అంకుల్ లు, ఆంటీలు చిన్న చిన్న పిల్లల్ని కూడా అత్యాచారాలకు గురి చేస్తున్నారు.

పాపం చిన్నపిల్లలు ఎవరికీ చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు బాధ పడలేక మొన్న ఒక అమ్మాయి విజయవాడలో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఆమెకు ఇప్పటివరకు న్యాయం జరిగిందా అతన్ని అరెస్టు చేశారు అతని అరెస్టు చేసిన అతను బెయిల్ పై తిరిగి వచ్చి మళ్ళీ తన పని తాను చేసుకుంటున్నాడు. ఇలాంటివి కాకుండా కఠినమైన చట్టాలు తెచ్చి అత్యాచారం చేసిన వెంటనే ఉరి తీసే విధంగా మన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

చట్టాలు రావాలి మహిళా సంఘాలన్నీ ముందుకు వచ్చి అత్యాచారానికి గురైన వారికి న్యాయం జరిగేలా చేయాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అత్యాచారానికి గురైన సోదరులు సోదరీమణులు అందరికీ ఈ కథ అంకితం ఇస్తున్నాను.

– భావ్యార్చన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *