మంత్రము
మాటకు ఎంతో శక్తి ఉంటుంది. మామూలు మాటలుగా మనం అనుకుంటాం కానీ అవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. మాటలు నోట్లోంచి వచ్చేటప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి మాట్లాడాలి. అయితే కొన్ని సార్లు మనకు తెలియకుండానే మనం మాట్లాడతాం. ఉదాహరణకి ఒక తెలిసిన వ్యక్తి వయసులో పెద్దవాడు ఉన్నాడు అనుకుందాం.
అతని గురించి మనకేవరో చెప్పారు. ఏదో విషయం అతని గురించి మాట్లాడుకున్నాం అనుకుందాం ఆ మాటల్లో. అరె అతను ఇంకా ఉన్నాడా అని అంటాం అంటే ఇది కావాలని అనే మాట కాదు మామూలుగా తెలియకుండా వచ్చే మాట కాబట్టి అలా మనం అనుకున్నా తర్వాత వారం రోజుల కే అతను చనిపోయాడు అనుకోండి.
అప్పుడు మనకు ఎలా ఉంటుంది. అయ్యో నేను అనడం వల్లనే చనిపోయాడు ఏమో అనే అనుమానం వస్తుంది. మనం మాట్లాడినప్పుడు ఉన్న వారు కూడా నిదెం నోరు రా ఇలా ఆన్నవ్ అలా పోయాడు అని అంటే మనకెంత బాధగా ఉంటుంది. నరం లేని నాలుక ఎన్నో మాటలు మాట్లాడుతుంది అని అంటారు కానీ ఆ మాటకు చాలా శక్తి ఉంటుంది. నీ శత్రువు నీ వాడు చేడిపోవలని బలంగా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే అది నీ సంస్కారం పైన ఆధారపడి ఉంటుంది. శత్రువు అయినా బాగుండాలని కోరుకోవడమే మన సంస్కారం.
మన మాట మంచిని మాత్రమే కోరుకోవాలి. మంచి మాటలే మాట్లాడాలి. మంచి విషయాలను మాత్రమే బోధించాలి. అప్పుడే ఆ మాట మంత్రంలా పని చేస్తుంది. నాకే పని చేతకాదు అని అనుకున్న వాడికి కూడా నువ్వు నీ మాటల ద్వారా శక్తిని ఇవ్వగలవు. మాటలతో నువ్వు చేయగలవు చేయగలవు అంటూ పదే పదె చెప్పడం వల్ల తను చేయగలను అనే నమ్మకం అతనికి కలిగి ఆ పని చేయవచ్చు. బలహీనులు కూడా నీ మాటలతో ప్రేరణ ఇవ్వవచ్చు.
అలా అని ఎప్పుడూ పడితే ఎప్పుడూ ఎలాంటి మాటలు పడితే అలాంటివి మాట్లాడకూడదు. ఏ సమయంలో ఏమి మాట్లాడాలి అనేది తెలిసి ఉండాలి.
– భవ్య చారు