మనోగవాక్షాలు
మనోగవాక్షాలు తెరిచి ఉంచు.
మనసు భాషను అర్థం చేసుకో.
మనసుకు కపటం తెలియదు.
మనోగవాక్షాలు తెరిచి ఉంచు.
ఇతరుల మనసులో ఏముందో
ఆ మనసున్నవాడికే తెలిసేను.
మనసున్నవాడే మంచి మనిషి.
మనసు కిటికీ తెరిచి ఉంచితే
మానవత్వమన్నది కనబడేను.
ద్వేష భావన తొలగిపోయేను.
మనసుకు శాంతి లభించేను.
మనసుగవాక్షాలు తెరిచి పెట్టు.
జీవితాన్ని హాయిగా గడువు.
జనులందరికీ ప్రేమను పంచు.
మెరుగైన సమాజాన్ని సృష్టించు.
-వెంకట భానుప్రసాద్ చలసాని