మనోభావాలు
మొన్న ట్విట్టర్ లో కొంచం గొడవ జరిగింది. ఎందుకు అంటే ఒకావిడ ట్విట్టర్ లో ఎప్పుడూ చీరలు కడుతూ అది కూడా బొడ్డు కిందకి కట్టి మొహానికి మాత్రం ఏమోజి పెట్టేది.
తనకు ఫాలోవర్స్ ఉన్నారు చాలా అయితే నేనేమన్నని అంటే ఇలా చీర కడితే ఫాలోవర్స్ పెరగడానికి అని ఎవరో పెట్టారు. దానికి నేను రిప్లై గా కావచ్చు మరి అందుకే కడతారు ఏమో అన్నాను.
ఇక అంతే ఆమె , ఆమె ఫ్యాన్స్ అందరూ నన్ను తగులుకున్నారు. మీరేం మాట్లాడుతూన్నారు. మీరు ఆడపిల్ల కదా అని చాలా అన్నారు నన్ను.
ఆవిడ అయితే నా మనోభావాలు దెబ్బతినేలా అన్నారు నాకు సారీ చెప్పాలి అన్నారు. దాంతో నాకు తిక్క రేగింది. అన్నది వేరే వాళ్ళు నేను జెస్ట్ రిప్లై ఇస్తే నన్ను. అంటున్నారు అని నేను గట్టిగా మాట్లాడాను.
మీలాంటి వాళ్ళు ఇలా చేయబట్టే బయట మానభంగాలు జరుగుతున్నాయి. మొహం కప్పుకుని బొడ్డు చూపించడం అవసరమా నీకు, పద్ధతిగా ఉండొచ్చు కద, ఒక వేళ మీకే ఏదైనా జరిగితే అయ్యో అంటూ ఏడుస్తారు . జరిగే దాకా చూసే బదులు, ఇప్పుడే జాగ్రత్త పడితే మంచిది కద అని అన్నాను.
దానికి ఆవిడ మీకు కుళ్లు, అసూయ కాబట్టి మీరలా అంటున్నారు. మీకు ఫాలోవర్స్ లేరని ఫీల్ అవుతున్నారు అంటూ నన్ను అనేసరికి నేను నాకు ఫాలోవర్స్ కోసం బట్టలు విప్పి తిరగను నీలాగా అన్నాను.
నాకు సపోర్ట్ గ ఒక అమ్మాయి కూడా వచ్చింది. తను అయితే ఇక బూతులు అందుకుంది. దాంతో వాళ్ళు సైలెంట్ అయ్యారు. నేను చివరికి ఒక్కటే చెప్పాను . ఏదైనా జరిగితే మీరే బాధ పడతారు. అలా బాధ పడకుండా ఉండటానికి మాత్రమే నేను మంచికే చెప్పాను తప్ప నాకు వేరే ఉద్దేశ్యం లేదు అని.
తర్వాత వాళ్ళు నా గురించి ఏవేవో మాట్లాడుకున్నారు అంట ఆ వేరే అమ్మాయి అకౌంట్ కూడా నాదే అని అనుకున్నారు అంట అని తర్వాత తెలిసింది. అయినా నేను చెప్పింది మంచికే కదా నా మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి అనడం కరెక్ట్ కాదు కదా, నేను సారీ చెప్పలేదు.
ఈ రోజుల్లో మంచి చెప్పినా వారికి చెడు గానే కనిపిస్తుంది.
-భవ్యచారు