మనశ్శాంతి
యోగా చేయండి. మనశ్శాంతిని పొందండి.ఈ ప్రపంచంలో మనశ్శాంతి కోసం తపించేవారు ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారిలోమోహనరావు గారు ఒకరు.మోహనరావుగారు ఎప్పుడూపని చేస్తూనే ఉండేవారు.
ఒకపని పూర్తి అయ్యేటప్పటికి మరోపని ఆయనకోసం సిద్ధంగాఉండేది. ఆయనకు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేది. ఆయన జీవితంలో ఆయనకుమనశ్శాంతి లేకుండా పోయింది.
ఆయనకు తనకుటుంబ సభ్యులతో గడిపేసమయం కూడా లేకుండాపోయింది. అలాంటి జీవితంపట్ల ఆయన తన అసంతృప్తినివ్యక్తం చేసేవాడు. యోగా డే రోజు టీవీలో యోగా యొక్కవిశిష్టత గురించి విన్నాడు.
ప్రతిరోజూ యోగా చేస్తే మంచిదిఅని తెలుసుకున్నాడు. యోగాచేస్తే మానసిక వత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుంది అనే విషయం గ్రహించాడు.
మరుసటిరోజు నుండి యోగా చేయటంమొదలుపెట్టాడు. అలా చేయడం మొదలుపెట్టినరోజునుండే ఆయన మనసుకు
హాయిగా ఉండేది. తన కుటుంబ సభ్యులతో కూడా సమయాన్ని కేటాయించి వారితో గడిపేవారు.
ఏకాగ్రతతోపనిచేయగలిగే వాడు. మంచి ఫలితం సాధించాడు. అతనికి మనశ్శాంతి లభించింది. కొత్త
ఉత్సాహంతో పనులు చేయటం మొదలుపెట్టాడు.
నిజంగా యోగా మనకుఆరోగ్యంతో పాటు మనశ్శాంతిని ఇస్తుంది అని ఋజువు అయ్యింది.
-వెంకట భానుప్రసాద్ చలసాని
యోగా చేయండి ప్రశాంతంగా జీవించండి.