మన్మధ బాణం
తుమ్మెదరాగం……
మన్మధ బాణం
మదినే గుచ్చింది…..
పువ్వుగా విచ్చింది…
నవ్వుల తోటి యవ్వన రాగం
అల్లరి చేసింది….
మువ్వల తోటి గువ్వల జంట
మదినే తాకింది…
పువ్వుల తోటి
వసంత రాగం
రానే వచ్చింది…
యవ్వన గిరులు
జివ్వున లాగి
రివ్వున ఎగిరే
రెక్కల గుర్రం కట్టింది…
సోకిల కిల కిల రావం కలలోకొచ్చి
మెల్లిగా మనసె దోచింది….
చలిలో చెలికి
చెకుముకి ఆట బరిలో
దిగిన బంతుల ఆట..
గెంతులు వేసి సంగతి ఏమంది…
బుంగమూతి బొంగురు పోయింది…
కొంగులు దాటక హద్దుల్లో పిల్లడు అని కనుసైగ చేసింది…
– పలుకూరి