మనషి పోరాటం
ఒక విశాలమైన ఎడారిలో
దారి తప్పిన ఒక మనిషి
దూరాన్ని తలచి, భయం అనే
భూతాన్ని తనలో నింపుకుని
అక్కడే ఉండిపోతాడు
చివరకి ఎడారికే అంకితం అయిపోతాడు.
మరొక మనిషి
నడిసముద్రపు అలల్లో చిక్కుకుని
బహుదూరపు గమ్యం
అసంభవం అని తెలిసినా
తనని తాను నమ్మి ముందుకు
వెళ్తాడు, కాలం కలిసివచ్చిందేమో
దారిన పోతున్న వాడ దరికి చేరుతాడు.
సముద్రపు మనిషి వలె
ముందుకు అడుగులు వేసి ఉంటే
అతను కూడా ఎడారిని దాటేవాడేమో.
మనిషి తీసుకున్న మొదట శ్వాస నుంచి
ఆఖరి శ్వాస వరకు పోరాడుతూనే ఉండాలి.
ఒకడు ఆకలికోసం పోరాడుతాడు
ఇంకొకడు ఆర్థికం కోసం
ఇలా ప్రతీ ఒక్కరు
తనకి కావాల్సిన దానికోసం పోరాడాల్సిందే,
ఇలా సాగుతున్న ప్రయాణంలో
తనని తాను మరచి చేసిన తప్పులేన్నో,
ఈ తప్పులుకి కారణాలు చాలా ఉండొచ్చు.
నీటిలో ఉండే చేపకు
నీరే సమస్య అయినప్పుడు
ఎం చెయ్యగలదు అవకాశం ఉంటే
మరొక కొలనులోకి వెళ్ళటం తప్ప.
అలాగే మనిషికి మనిషే శత్రువు అయినప్పుడు
ఎవరు ఎం చెయ్యగలరు పోరాటం తప్ప.
మనిషి చేసే వృత్తి ఏదైనాకావొచ్చు,
కానీ ఒక ఒక తండ్రిగా,తల్లిగా భర్తగా,భార్యగా కొడుకుగా,కూతురుగా, చెయ్యాల్సిన బాధ్యతలు కోసం
అనుక్షణం పోరాడుతున్న సగటు మనిషి గురించి ఎంత చెప్పినా తక్కువే.
– కోటేశ్వరరావు