మనిషి – ఊహ
దీనికి రూపం వుండదు కానీ మన రుపాని కన్నా దీనికే విలువ
కదలిక లేకున్నా నచ్చిన చోటికి పోతూనే వుంటుంది
చేతుల్లేవు కానీ మనల్ని నచ్చిన వైపు లాగుతునే వుంటుంది
దీని బలం అమోఘం మనిషిని ఒకలా వుండ్నివ్వడు అసలు ఛాన్స్ ఈవాలే గానీ ఊహల్లో మనిషిని బ్రతికించి చంపగలదు
వాస్తవం లో వ్యక్తిని వైవిధ్యం గా చేయగలదు
ఎంత చేసినా ఎప్పుడో ఒకప్పుడు సరదాగా కాసేపు మనిషి మాట వినట్లు నటిస్తుంది
అందరి ముందు మంచి వాడిలా చూపించి, ఏడిపించింది, తను నవ్వుకోటనికి ఏమో…
రోజంతా పనిచేస్తూనే వుంటుంది కొత్తగా ఏ సమస్య తెద్ధామనో.
ఎంత చిత్రం కదా ఈ మనిషి మనసు ..!
– పొన్నగంటి భాస్కర రావు