మంచు దుప్పటి
మంచు కురిసే వేళలో, నీ తలపుల నావలో నా మనసక్కడే ఆగిపోయింది.
కదలనంటూ మోరాయిస్తోంది…
నీ చిరునవ్వులో మది చిక్కుకు పోయింది.
నిన్నూ నన్నూ ఈ మంచు దుప్పటి కమ్మేసిందా అనే విస్మయాన్ని కలిగిస్తుంది.
నీతో మమేకమవమంటూ కాలం తొందర చేస్తుంది.
కలలు అన్నీ తీర్చుకోవాలని నా మనసు, సొగసు ఉవ్విల్లూరుతుంది.
నీ వెచ్చని కిరణాల తాకిడికి నా మేనంతా పులకరిస్తుంది.
కాసేపైనా నిన్ను కౌగిలించుకుని ఉండాలని ఉంది
కానీ నువ్వేమో ఆ కాసేపటికే నిప్పులు చిమ్ముతూ
నా ఒళ్ళంతా పగుళ్లు వచ్చేలా చేసావు
నా శరీరమంతా బీటలు వారెలా చేసావు
అందుకే నువ్వెంత ఇష్టమైనా నీకు దూరంగా వెళ్తున్నా
నిన్ను చూడకుండా నా దుప్పట్లో కి జారుతున్న
నీ నీడ పడకుండా నా తలుపులు ముస్తున్నా …
– భవ్య చారు