మంచితనం
మంచితనం…మానవత్వం
మచ్చు కైనా కానరాదే…
మంచితనం మరిచిపోయి
మర మనిషివి అయ్యావా…
తోటి వారిని…సాటి వారిని
మాటల తూటాలతో గాయపరిచి
స్వార్థపూరిత భావంతో
అహంకారం తలకెక్కి…
మనిషిగా బ్రతకలేని..
ఓ…మనిషి నీ మనుగడ ఎక్కడా..!?
ఒకసారి.. వెనుదిరిగి చూడు
ప్రేమించే గుణం నీలో ఉంటే…
ప్రపంచమే ఒక అధ్బుత సుందర దృశ్యం.
– అంకుష్