మంచితనం
మంచితనానికి మించిన సంపద లేదు అంటారు పెద్దలు. కాని ఈ రోజుల్లో
దానిఅర్దంమారిందిఅనొచ్చు
మంచితనం అంటే అడిగాను నేను కొందరిని
సమాజంలో వచ్చిన
సమాధానం ఏమంటే;
మంచి తనం ఎక్కడ దొరుకుతుంది అంటున్నారు
మంచి మనసే మంచితనం
అంటున్నారు కొందరు
మంచితనంపిడికెడునెలవు
అంటున్నారు కొందరు
మంచితనంఅసలేపనికిరాదు అంటున్నారు కొందరు
మంచి చేస్తే మనకే మంచి
జరుగుతుంది అంటున్నారు
కొందరు
మంచి తనం నమ్మటం లేదు ఎవ్వరు అంటున్నారు
కొందరు
మంచితనం నాకోసం ఒక గోడ అంటున్నారు కొందరు
మంచి తనం చేతకానితనం
అంటున్నారు కొందరు
మంచితనానికి రోజులు లేవు
అంటున్నారు కొందరు
మంచితనం తెలివితక్కువ
అంటున్నారు కొందరు
ఈ తరంవాళ్ళుఅంటున్నారు
ఇది కొత్త పదమా అని
మంచితనం బ్రతకడానికి
పనికొస్తుందా అంటున్నారు
కొందరు
చిన్న పిల్లలు అంటున్నారు
కొనేసుకుందాం అని
ముందు తరం వాళ్ళు అంటున్నారు మేము వాడాము అని మంచితనం
సహాయము పొందిన వాళ్ళు అంటున్నారు మాకు
ఉపయోగమే మంచితనం అని
నిజాలు మాట్లాడేవారు
అంటున్నారు అది మన
మనసులోంచి రావాలి కదా అని
మంచితనం మనుషులకే
కదా అంటున్నారు కొందరు
మంచితనము లేకపోతే
ప్రపంచం మనుగడ ఎలా
అని అంటున్నారు కొందరు
మంచితనం ఎక్కువైతే
కష్టాలు వస్తాయి అంటున్నారు కొందరు
మంచితనంముంచుతుంది
అంటున్నారు కొందరు
మంచితనం మనిషికి గొప్పతనం అంటున్నారు
కొందరు
మంచితనాన్ని గుర్తిస్తే బావుండు అంటున్నారు
కొందరు
మంచితనం వుంటే అందరి
మనసుల్లో స్థానం వుంటుందికదాఅంటున్నారు కొందరు
మనకు కావలసిందే మంచితనంకదా అంటున్నారు కొందరు
మంచితనం నమ్మకానికి
ప్రతీక అంటున్నారు కొందరు
మంచితనానికి మారుపేరు గా బ్రతకాలి అంటున్నారు
కొందరు
మంచితనం మాయమైపోతుంది అని
అంటున్నారు కొందరు
ఏది ఏమైనా మంచితనం
అనేది మనలోవుంటేమంచి
అనుభూతి కలిగేది మాత్రం
మనకే అంటారు కదా……?
– జి జయ