మంచి చెడు
ఐదుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ వయస్సు 17 నుండి 18 సంవత్సరాలు ఉంటాయి.”రవి ఎక్కడికి వెళ్లుతున్నావ్. వాళ్ళతో తిరగవద్దు అని ఎన్ని సార్లు చెప్పినా వినకుండా వాళ్ళనే తిరుగుతున్నావు” అని కోపంతో చెప్పాడు రమేష్.
“నేను నా ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళుతున్నా వాళ్ళు చాలా మంచి వాళ్ళు నాన్న” అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు రవి.”ఈరోజు కిరణ్ పుట్టిన రోజు రాత్రి వాడే పార్టీ ఇస్తాను మమ్మల్ని రమ్మని చెప్పాడు. ఏ టైం కి వెళదాము” అని అడిగాడు రవి.
“ఏడు గంటలకు వెళదాము. అందరూ రెడీ అయ్యి ఇక్కడిని వచ్చేయండి” అని చెప్పాడు రాజు.అందరూ సరే అని చెప్పి కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు.తరువాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు.
అక్కడే ఒక టీ షాప్ ఉంది. ఇద్దరు పెద్ద మనుషులు ఇలా మాట్లాడుకుంటున్నారు.ఈనాటి పిల్లలు మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోకుండా స్నేహాలు చేస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా పగ పెంచుకొని చంపేస్తున్నారు.
రాత్రి పార్టీ కోసం రెడీ అవుతున్న రవికి “చక్కగా చదువుకోకుండా ఇలాంటి తిరుగులు ఎందుకు తిరగడం” అని బాధతో చెప్పాడు రమేష్.”కానీ రవి మాత్రం రమేష్ మాటలు వినకుండా” బయటకు వెళ్ళిపోయాడు.
పార్టీ దగ్గరకు నలుగురు వెళ్ళారు. అక్కడ ఏర్పాట్లు చూసి “ఆహా! పార్టీ ఏర్పాట్లు చాలా బాగా చేశావు రా” అని చెప్పాడు రాజు.”ఇంకా నుంచి మనకి మంచి రోజులు వస్తాయి” అని ఆనందంగా చెప్పాడు రవి.
కిరణ్ వచ్చి “ఎలా ఉన్నాయి రా ఏర్పాట్లు? మీకు ఇష్టం వచ్చినట్టు పార్టీ ఎంజాయ్ చేయండి” అని చెప్పాడు.పద రా కేక్ కట్ చేయి అని చెప్పి అందరూ కేక్ దగ్గరకు వెళ్లి కేక్ కట్ చేశాడు కిరణ్. అందరూ బర్త్ డే విషెస్ చెప్పుతూ ఒక్కొక్క కేక్ ముక్క ఒక్కొక్కరికి పెట్టుతున్నాడు.
అందరూ కేక్ తిన్న తరువాత “రేయ్! మీరు ఈ ఏర్పాట్లు కు మీరు అందరూ డబ్బులు ఇవ్వండి రా” అని అడిగాడు కిరణ్.రవి కోపంతో “బర్త్ డే నీది రా. మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి” అని అడిగాడు.హ్యాపీ గా ఉన్నా వాతావరణం కోపంగా మారిపోయేసారికి “నేను జోక్ చేశాను అని అబద్ధం చెప్పాడు కిరణ్.”
“సరే మీరు పార్టీ ఎంజాయ్ చేయండి” అని చెప్పి పక్కకు వెళ్ళిపోయాడు కిరణ్.ఫోన్లో మాట్లాడుతూ “ఏంటి మీ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు ఇస్తుకున్నావా ?”అని ఎవరో అడిగారు.”నేను అడిగాను కానీ వాళ్ళు నాతో మీద చాలా కోపంగా ఉన్నారు” అని చెప్పి కాల్ కట్ చేశాడు కిరణ్.
ఈ మాటలు మహేష్ విని మిగతా వాళ్ళకి చెప్పాడు. అందరూ ఫుల్లుగా తాగేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు.మార్నింగ్ రవి మిగతా ముగ్గురికి ఫోన్ చేసి వెంటనే “మనము ఎప్పుడు కలుసుకునే చోటికి రండి అని చెప్పాడు.”
కాసేపు తరువాత “నిన్న పార్టీ లో మనకి డబ్బులు అడగడం ఏమిటి? నాకు అర్దం కావడం లేదు” అని చెప్పాడు మహేష్.”ఈరోజు మనం కిరణ్ కి పార్టీ ఇస్తున్నాము. ఆ పార్టీ లోనే కిరణ్ గాడిని చంపేయాలి” అని చెప్పాడు రవి.
“హా మిగిలిన వాళ్ళు నోరు తెరచి మనం కిరణ్ ని చంపేస్తే పోలీసులకు దొరికిపోతాము” అని చెప్పాడు మహేష్.ఇలా ప్లాన్ వేసుకొని సాయంత్రం పార్టీ రమ్మని చెప్పారు కిరణ్ కి.
కిరణ్ పార్టీ కి వెళ్ళిన తరువాత బాగా తాగించి రోడ్డు మీద చంపేసి ఆక్సిడెంట్ గా చేశారు.
నలుగురు ఇంటికి వెళ్ళిపోయారు. ఉదయమే టీవీ లో ఎవరో ఒకరు యాక్సిడెంట్లు చనిపోయారు అతను వివరాలు సేకరిస్తున్నారు అని చెప్పారు.అది ఆనందంతో మనం దూరంగా వెళ్లిపోవాలి అని అనుకున్నా టైంలో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ద్వారా యాక్సిడెంట్ చేసింది ఎవరో దొరికిపోయారు.
వాళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు.ఈ కాలంలో పిల్లలకు మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోకుండా స్నేహాలు చేస్తున్నారు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని మసులుకోవాలి.
-మాధవి కాళ్ల