మానవత్వవాది
మానవత్వం ఉన్న ప్రపంచాన్నే
కోరుకుందాం మనమందరం.
రాక్షసత్వం ప్రదర్శించే వారిలో
మార్పుని కోరుకుందాం మనం.
మానవత్వం మనసుకు ధరించే అతి విలువైన ఆభరణమే కదా.
అది లేని మనసు పేదదే సుమా
అది ఉన్న మనిషే దేవుడే కదా.
మానవత్వాన్ని మనసులోకి
ఆహ్వానిద్దాం. మంచి మనిషి
అని పేరు తెచ్చుకుందాం.
-వెంకట భానుప్రసాద్ చలసాని