మానవత్వమా
పసి గుడ్డును వదలలేరుముసలి అవ్వను వదల లేదు.అమ్మాయిని వదలలేదు.అన్నా నీ దణ్ణం పెడతాను అంటున్నా
నీ అందాలు బాగున్నాయి అంటూచిల్చి చెండరారు.
ఒకరి పై కోపంఉన్నా, ద్వేషం ఉన్నా కోపాన్ని చూపించేదిఅతివల పైనే, అత్తారింట్లో అనరాని మాటలు అంటూ
మనసు విరిగేలా చేస్తారు. నువ్వే నా లోకం మంటూ తిరిగిన వాడు అవసరం తీరాక ముక్కలుగా చంపి కాకులకు వేస్తాడు.
వాడిని చూసి మరొకడు కూడా ప్రేయసిని రమ్మని పీల్చి బ్లేడ్ తో గొంతు కొస్తాడు. అయినా మన సమాజం చూస్తూనే ఉంటుంది.
మరొకడు నడి బజారులో కత్తితో పొడిచిన, కాలేజీలో హత్య చేసినా పారిపోతారు తప్ప ఇది మేము చూసాము అని ఎవరూ ముందుకు రారు.
ఒక వేళ వచ్చినా లాయర్లు సవాలక్ష ప్రశ్నలు వేసి వారిని తిక మక పెడతారు.
కారులో వెళ్తున్నా దంపతులను చంపినా వారిని కాపాడరుకారులో సిటీ అంతా తిప్పుతూ రేప్ చేసినా అడగరు. ఆ మాకెందుకు అనుకుంటారు. ఈ మానవత్వం లేని మనుషులు.
రోడ్డు పై యాక్సిడెంట్స్ అయితే ఎవరా అని చూస్తారు తప్ప అంబులెన్స్ కి ఫోన్ చేయరు ..చేస్తే మకెక్కడ చుట్టుకుంటుంది అనే భయం .
బ్రతకండి ఇంకా భయం లోనే బ్రతకండి ఓ మానవత్వం లేని మనుషుల్లా రా ( నాతో సహా ) భయం తో బ్రతకండి..
ప్రశ్నించే దైర్యం లేనప్పుడు గాజులు తొడుక్కుని ఇంట్లో నాలాగా కూర్చొండి, అడ మగ అనే తేడా లేకుండా మన గళాన్ని విప్పి ప్రశ్నించే రోజు రావాలని కోరుకుందాం .
ఇకనైనా కళ్ళు తెరవండి. జరిగే అన్యాయాలను ప్రశ్నించండి. మేల్కొండి, నిద్రావస్థ లో నుండి ధైర్యంగా ముందుకు కదిలి రండి…..
-భవ్యచారు