మానవత్వం
మనశ్శాంతి…
అది ఎక్కడుంది?
ఎక్కడ దొరుకుతుంది?
ఎంత రేటయైనా సరే..
కొనుక్కుందాం!!
ప్రతి వస్తువు మార్కెట్లో..
కొన్నట్టే..
మనసును శాంతినీ రెండింటినీ..
కొనుక్కో వలసిందే!!
మనసే లేని మనుషుల మధ్య..
బ్రతుకుతున్నాం కదా!!
అందుకే..
ఎక్కడ దొరికినా కొనుక్కో వలసిందే!!
మానవత్వం మనిషి తత్వం..
మాయమై పోయిన రోజులివి..
మనుషులే మారిపోయాక..
ఇక మనసులు ఎక్కడివి?
వాటికి శాంతి ఎక్కడ?
పొరపాటుగా ఆలోచిస్తున్నామేమెా!
మన గ్రహ పాటు ఇంతేనేమెా!
ఈ కాలంలో పుట్టడమే మన శపమేమెా!!
-ఉమాదేవి ఎర్రం