మనసులోని మాటలు
కవితకు ప్రాణంపోసే కవి
మనసులోని భావాలు ఎన్నో.
అక్షరాలనే సుమాలను ఒక
మాలగా చేసే వాడే సుకవి.
పాఠకుల ప్రశంసలే తన
శ్వాసగా జీవిస్తాడు కవి.
మనసులోని భావాలను
సమాజానికి పంచేస్తాడు.
చుట్టూ జరిగే సంఘటనలపై
స్పందించేదే కవి హృదయం.
సమాజం హితం కోసమే
కవి హృదయం తపిస్తుంది.
కవి హృదయాన్ని గాయపరచకు నేస్తమా.
ఎందుకంటే అందులోనే
సమాజ హితం ఉంది.
-వెంకట భానుప్రసాద్ చలసాని