మనసు పరిమళం
అసహ్యించుకుంటావేందుకు
కుళ్ళిపోయిన దేహన్నే కావచ్చు నేను
నలిగిపోయిన పుష్పాన్నే కావచ్చు
చితికి పోయిన చితి మంటనే కావచ్చు
మగతనపు నిరూపణ కోసం పెళ్ళి పేరుతో ఒకడు
స్వార్థపు తెరలను కప్పి పుచ్చుకుని ప్రేమ పేరుతో
శరీరాన్నీ కామించిందొకడు
యుక్త వయసు రాగానే ఒకింటికి పంపించేయాలి గుండెలపై బరువు దించేసుకోవాలని భావించిందొకడు
నాకు దక్కని అందం మరోకడికి దక్కిందని కుట్రలకు పాల్పడింది ఒకడు
నేను నా మనసేంటని నాకేమి కావాలో చెప్పుకోలేని దౌర్బాగ్యపు స్థితుల్లో పెట్టింది ఒకడు
ఆ ఒక్కడు అనే వాడు తండ్రి రూపంలో
అన్న రూపంలో
మొగుడి రూపంలో
స్నేహితుడి రూపంలో
ప్రియుడి రూపంలో చేసిన గాయాలకు కుళ్ళిన దేహమే ఇది
అసహయపు పడతి ఆవేదనే ఇది
కుళ్ళిన దేహపు
మనసు పరిమళం చూడు
ఆడతనం అమ్మతనం కనిపిస్తాయేమో
అర్హత లేని అసహయురాలినేనేమో
కానీ ఆశయం ఉన్న అతివ కనిపిస్తుందేమో
బాహ్య సౌందర్యపు మది చాటు అంతరం చవి చూడు
ప్రేమ అనే రెండక్షరాల కోసం ఆమే కోల్పోయిన జీవితం కనిపిస్తుంది
ఆమెని చదివి చూడు
ఆమే అనుభవాలు నేర్పిన గుణపాఠాలతో మారిన
ఒక నిశ్చలత్వం నిర్మలత్వం కనిపిస్తుంది
ప్రతి ఆడదానికి మనసుంటుంది
అది ఒక్కడి రూపంలో అనుక్షణం ముక్కలై రూపంలేని
శూన్యం అవుతుంది..
-గురువర్ధన్ రెడ్డి