మనసు మాట

మనసు మాట

 

మనసులోపల బాధ ఉంది.
నీతో ఏదో చెప్పాలని ఉంది.
చెప్పలేని పిరికితనం ఉంది.
చెప్పే ధైర్యాన్ని ఆహ్వానిస్తే,
అది రానే రానని అంటోంది.
పిరికితనాన్ని పొమ్మంటుంటే,
అది పోనే పోనని అంటోంది.
మనసులోని మాటను చెపితే
ఏమంటావో అనే అనుమానం.
చెప్పకపోతే నేనేమైపోతానో.
ఈ డోలాయమాన పరిస్థితి
నుండి బయటపడగలనా.
నువ్వే నా మనసున మనసై
ఉంటావని నే చెప్పగలనా.

.
-వెంకట భానుప్రసాద్ చలసాని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *