మనసు మైకం
తనని తాను మరచిపోతూ తుల్లిపడుతుంది…
లోకమేతానై జీవిస్తూ లోలలాడుతుంది…
తనలోతానే మమేకమవుతూ ఊయల ఊగుతుంది…
తన నిచ్చెలికోసం ఆరాటం ఓ మైకం…
తన జీవనం కోసం పోరాటం ఓ మైకం…
తన అస్థిత్వం కోసం తపన ఓ మైకం…
తనని తాను కోల్పోతూ…
తనని తాను వెతుక్కుంటూ…
తనలోని మౌనమే ఓ ప్రశ్నగా
తనలోని నిశ్శబ్దమే ఓ సమాధానంగా…
చివరి తనలోకంలో తాను విహరిస్తూ
మైమరచిపోతు ఊగిసలాడుతుంది…
– గోగుల నారాయణ