మనస్సు చదివిన వేదం

మనస్సు చదివిన వేదం

పల్లవి : —

మనస్సు చదివిన వేదం మన్నింపులా
జీవితం…
కావాలి అనుదినం ప్రేమలు బతకాలని…
కొసరని తనువుకు చిలికిన జల్లులతో
ముసిరిన మల్లెలు మోహాన్ని తడుపు
చున్నవి…

మనస్సు చదివిన వేదం…

చరణం :—-

కాయని కాలం దూరమెంతోనని…
తెలియని వింతగా…తొలిచిన రెక్కలను
ఊహల విహంగాలకు కడుతు…
పురివిప్పని ఆకాశాన కనిపించని
దారులకై ఎదురు చూస్తున్నది…

మనస్సు చదివిన వేదం…

చరణం :—-

మధన పడిన ప్రతిక్షణం…
మోహాలు వెక్కిరింతలై మనస్సును
గాయం చేస్తున్నవి…
మరుగున పడిన జ్ఞాపకాలు వీడిన
వసంతాలై ఆ కనుపాపల పై చిత్రాలను
అడుగలేక…నీకై తెరిచిన తలుపులు
మూతపడుచున్నవి…

మనస్సు చదివిన వేదం…

చరణం :—-

తెలిసిన మనస్సును మేల్కొలుపుతు
కోరికల వెచ్ఛధనాలు సుఖాలు
కాలేవని…విరిగిన మోడులతో దుఃఖాన్ని పూయించలేవని…కలగన్న నా మధిలో
ఆశలను నిలుపుకోలేని వివరణ
అంతర్ యద్ధంగా మిగిలింది…

మనస్సు చదివిన వేదం…

 

-దేరంగుల భైరవ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *