మనసంతా నువ్వే
ఇల్లంతా సందడిగా ఉంది కానీ జానకి మాత్రం దిగులుగాఉంది. అసలేమయిందంటేజానకి తండ్రి ఆమె కోసంపెళ్ళి సంబంధాలు చూస్తున్నాడు. జానకిపెళ్ళీడుకి వచ్చింది. జానకి తన
ఇంటి దగ్గరే ఉన్న రాజునిప్రేమించింది. రాజు కూడాఆమెను ప్రేమించాడు. అయితేఆ విషయం ఆమె తండ్రికి చెప్పలేదు. రాజు మంచి మనిషిఅవ్వటం వలన జానకి అతన్ని
ప్రేమించింది. ఒకరోజు జానకితండ్రి ” రేపటి రోజు పిల్లను చూసుకోవటానికి పెళ్ళివారు వస్తున్నారు.” అని చెప్పారు.
అంతే జానకి చాలా దిగులుపడింది. మరసటి రోజుపెళ్ళివారు వచ్చారు. జానకి తన ప్రేమ విషయం తండ్రికిచెప్పలేదు. కాఫీ తీసుకుని రమ్మని చెప్పాడు తండ్రి చెప్పగానే ఏడుపు మొహంతోకాఫీ తీసుకుని వెళ్ళింది.అక్కడకి వెళ్ళి చూడగానేఆమె ఆనందానికి అవధులులేకుండా పోయింది. పెళ్ళి చూపులకు వచ్చింది తను
ప్రేమించే రాజు.
జానకితండ్రి ఆమెను చూసిముసిముసిగా నవ్వాడు.ఆయనకి వారి ప్రేమ విషయం. ముదే తెలుసు. రాజుతల్లిదండ్రులను ఒప్పించిపెళ్ళిచూపులకు వారినిఆహ్వానించాడు. జానకి మనసంతా రాజే. అలాప్రేమ జంటకు పెళ్లిజరిగింది. కధ సుఖాంతం అయ్యింది.
-వెంకట భానుప్రసాద్ చలసాని