మనదే బంగారు భవిష్యత్తు

మనదే బంగారు భవిష్యత్తు

రాబోయే కాలం అంతా మంచిదే. టెక్నాలజీ పరంగాఅన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోంది. ముఖ్యంగా రచయితలకు బంగారు భవిష్యత్తు ఉండబోతోంది.పాఠకులు కూడా తెలుగు

భాష పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కొత్తదనం కోరుకుంటున్న పాఠకులకుకొత్త రచనలు అందించటం రచయితల బాధ్యత. వెరైటీ కధలకు పాపులారిటీ ఎక్కువ ఉంది.

ఆ విషయం గ్రహించినరచయితలు ఆ దిశగా తమ అడుగులు వేస్తున్నారు. అశ్లీల సాహిత్యానికి తిలోదకాలు ఇచ్చి మంచి సాహిత్యాన్నిచదివేందుకు యువ పాఠకులుకూడా ఆసక్తి చూపుతున్నారు.

ఇదివరలో అశ్లీల సాహిత్యాన్నిచదివేవాళ్ళు కూడా ఇప్పుడు మనసు మార్చుకుని కొంగ్రొత్తరచనలు చదివి మన యువ రచయితలను మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తున్నారు.

ఇప్పుడు వస్తున్న పాపులర్ సినిమాలన్నీకొత్త ఒరవడిని ముందుకు తీసుకుని వెళుతున్నాయి.

ఈ సినిమాల్లో కధే హీరో. కధ బాగుండబట్టి ప్రేక్షకులు ఆయా సినిమాలను ఆదరిస్తున్నారు. మూస పద్ధతిలో మాస్ మసాలా నింపి తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దెబ్బతింటున్నాయి.

సృజనాత్మక కధలతో తీయబడ్డ సినిమాలు బాక్సాఫీస్ బద్దలు కొట్టే కలక్షన్స్ వసూలు చేస్తున్నాయి.

రచయితలే సినిమా డైరెక్టర్లు అయ్యే రోజులు వచ్చేస్తున్నాయి.

-వెంకట భానుప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *