మన నాశనం
మన మీద బయటకు మాత్రం ప్రేమ ఉంటూ నటిస్తూ
మనసు లోపల మాత్రం నాశనం చేయాలని చూస్తూ
మన మంచితనమే వాళ్ళకి శ్రీరామరక్ష
వాళ్ళు చేసిన ప్రతి తప్పుని క్షమించడం మనది తప్పు
మంచి అనే ముసుగులో కపట నాటకం నటిస్తూ
అందరి మీద ప్రేమ ఉంది అని నమ్మిస్తూ
మనల్ని నాశనం చేయడానికి ఒక అవకాశం కోసం ఎదురుచూస్తూ
మనం ఏం చేస్తున్నామో అన్ని గమనిస్తూ
మన వెనకాలే గోతులు తీస్తూ
మనం ఏడుస్తున్నప్పుడు ఓదార్పుగా మాట్లాడుతూ
వాళ్ళు మనసులో సంతోషం పడుతూ
మనల్ని ఇంకా ఇంకా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ
చిన్న విషయానికి వాళ్ళకి బుద్ధి చెప్పితే
అది వాళ్ళు అవమానంగా భావించి
మనల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకొని
ప్రతి క్షణం మన గురించే ఆలోచిస్తూ
వాళ్ల జీవితం ఎటు పోతుందో ఆలోచించకుండా
వాళ్ల జీవితమే చేతులారా నాశనం చేస్తున్నారు.
ఇతరులు మనకి మంచి చెప్పితే
వినే వాళ్ళు ఎవరు లేరు…
మంచి అనే ముసుగులో తప్పు చేసి
మనకే దొరికిపోతున్నారు…
మనం కూడా అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటూ
వాళ్లు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి…
ఇలాంటి తప్పు వాళ్ళు మరెప్పుడూ చేయకుండా
ఉండాలి అంటే తగిన రీతిలో బుద్ధి చెప్పాలి…
మన నాశనం కోరుకునే వాళ్ళకి
వాళ్లే నాశనం అవుతారు అని తెలుసుకోవాలి…
-మాధవి కాళ్ల