మన హైదరాబాద్
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని. హైదరాబాద్ నగరం అభివృద్ధి పధంలో దూసుకుని వెళ్తోంది. ఈ నగరం మత సామరస్యానికి పెట్టింది పేరు.ఈ నగరంలో చార్మినార్, గోల్కొండ కోట వంటి అనేక ప్రపంచ ప్రసిద్ధి చెందిన చారిత్రక కట్టడాలు ఉన్నాయి. చార్మినార్ 400 ఏళ్ళ నాటి కట్టడమైనా ఇప్పటికీ చెక్కుచెదరలేదు.
చార్మినార్ ఒక అద్భుతమైన కట్టడం. భద్రాచలంలో శ్రీరామాలయం కట్టిన రామదాసు కొన్నాళ్ళుగోల్కొండ కోటలో ఉన్న కారాగారంలో ఖైదు చేయబడ్డారు అని చరిత్రలో లిఖించబడింది. శ్రీ రాముడేతన తమ్ముడు లక్మణుడితోవచ్చి నవాబుకు ఈ రామదాసు కట్టవలసిన సుంకాన్ని చెల్లించిరామదాసును విడిపించారనేది
ప్రజలు నమ్ముతున్నారు.
గోల్కొండ కోటను జయించడం మొఘల్ చక్రవర్తుల వల్ల కూడా కాలేదు. చివరకు ఒక ద్రోహి ఆచక్రవర్తులకు అమ్ముడుపోయి ఆ కోట ద్వారాలు తెరవటం వల్ల ఆ కోటను ఆక్రమించటం
వారికి సాధ్యం అయిందని చరిత్రలో వ్రాయబడింది. ఇక్కడ ఉన్న సాలార్జంగ్ మ్యూజియం ప్రపంచ ప్రసిద్ధి చెందిన మ్యూజియంగా వన్నెకెక్కింది.
నగరానికి దగ్గరలోనే ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కు నగర ప్రజలనేకాక దేశప్రజలను కూడా ఆకర్షిస్తోంది.ఈ జూలో అనేక అడవి జంతువులే కాక పక్షులు,సర్పజాతులు కూడా ఉన్నాయి.ఈ జూలో సఫారీ కూడా ఉంది.ఆ సఫారీలో సింహం, పులులను అతిదగ్గర నుండి చూడవచ్చు.
హుస్సేన్ సాగర్ పై కట్టినట్యాంక్ బండ్ సాయంత్రంపూట ఎందరికో ఆటవిడుపుగా ఉంది. ఇక్కడే హుస్సేన్ సాగర్మధ్యలో భవ్యమైన బుద్ధుని విగ్రహం ఉన్నది. లుంబినీ పార్కునుండి మనం హుస్సేన్ సాగరులో బోటు షికారుచేయవచ్చు. చెరువులో ఉన్న బుద్ధుని విగ్రహం వరకు వెళ్ళి
రావచ్చు.
అదే ప్రాంతంలోఎన్.టి. ఆర్ పార్కు కూడాఉంది. ఈ మధ్యనే కొన్ని వందల కోట్లు ఖర్చుచేసితెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయాన్ని అక్కడ నిర్మించారు. ఆ సచివాలయానికి దగ్గరలోనే దేశంలోనేపెద్దదైన అంబేడ్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పారు.
ఇక్కడి ప్రజలు మతసామరస్యాన్ని చక్కగాపాటిస్తారు. హైదరాబాద్నగరంలో కట్టబడిన మెట్రో రైల్ కట్టి తెలంగాణాకే కాదు భారతదేశానికే గర్వకారణం. ఇక్కడఉన్న కోఠీ ప్రాంతం వ్యాపారాలకు కేంద్రగా ప్రసిద్ధి చెందింది. నలభైకు పైగా గొలుసుకట్టు చెరువులతో కళకళలాడుతూ ఉంటుందిఈ నగరం. లక్షలమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది ఈ నగరం.
ఇక్కడి ప్రజలు శాంతి కాముకులు. నగర వాతావరణం అన్ని కాలాలలో కూడా బాగుంటుంది. దేశవిదేశాల నుండి విద్యార్థులువచ్చి ఇక్కడ ఉన్న ప్రసిద్ధి చెందిన ఉస్మానియా,హైదరాబాద్ మొదలగు యూనివర్సిటీలలోఉన్నత విద్యను అభ్యసించుచున్నారు.
ప్రాధమిక విద్య నుండిఉన్నత విద్య వరకుఅభ్యసించేందుకు మంచి అవకాశాలు ఉండటంతో విద్యార్థులు ఇక్కడ చదివేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధులుఊపిరి పోసుకున్న నేల ఇది.
ఇక్కడి ప్రజలలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది.ఇలా వ్రాసుకుంటూ పోతే అనంతంగా ఈ నగరం గురించి
వ్రాయవచ్చు.
-వెంకట భానుప్రసాద్ చలసాని