మమైకం
సారాయి దే మైకమా?
రాయి లాంటి నీవు రత్నమా?
రాలు జీవాలను ముంచి
రాలిన పైకాలను తెచ్చి
బీరువాలు నింపి పై పై కి తేలే
మందు బాబుది (వైద్యుడు) యే సారాయి?
మైకు చేతబట్టి
మత్తు ఎక్కించే మాటలు చెప్పి
నీకు మైకాలు కమ్మించే
నాయకుడిది యే సారాయి?
ప్రధానభూమికలే
మన మత్తుచూపు భామలది
నీ చలనాలు తప్పగ
చలన చిత్రాలు వచ్చెగా ……!
మరి ఈ జవ(రాళ్ళ)ది
యే సా………రాయి!
చదువుల పేరు చెప్పి
చందనాలు పూసి
చందమామని చూపి
చందాలను దోచి
చామరులు పట్టి
నిన్ను నిదురబెట్టిన
ఈ విద్యది యే సారాయి?
సిసలైన గుడుంబా దే నోయ్!
– వాసు