మళ్ళీ రైలు తప్పిపోయింది బుక్ రివ్యూ
గొల్లపూడి గారి రచన ఎంత అద్భుతంగా ఉందంటే ఇంత గొప్ప పుస్తకాన్ని ఎందుకు ఇంత ఆలస్యంగా చదివానా అనిపించింది నా మీద నాకు కోపం వచ్చింది… ఒక్కసారి చదివితే మర్చిపోలేని ఈ పుస్తకం గురించి నా అభిప్రాయాలు…
ఇందులో పాత్రలు చంద్రుడు, తులసి, వలజ అలాగే నరసయ్య, రుక్మిణి, రంగరాజ్ ఎంతగా మనల్ని ఆకట్టుకుంటాయంటే పుస్తకం చదివిన చాల సేపటి వరకు మన కళ్ళ ముందే ఆ పాత్రలు కనిపిస్తూనే ఉంటాయి అసలు మన మెదడులోంచి వెళ్ళవు… ఒక్కో పాత్రను మారుతీ రావు గారు మలచిన తీరు అద్భుతం.
ఇక ఇందులో లైఫ్ ఫిలాసఫీ చెపుతున్నట్టుగా గొల్లపూడి గారు రాసిన కొన్ని వాక్యాలయితే జీవితంలో ఎప్పటికీ గుర్తుపెట్టుకుని ఆచరించే విధంగా ఉన్నాయి.కేవలం ఒక్క రాత్రిలో జరిగే కథని ఇంత అద్భుతంగా రాయడం అన్నది ఆయనకే సాధ్యమైంది అనిపించింది.
ఒక నటుడిగా ఆయన్ని ఎంత అభిమానించానో ఈ పుస్తకం చదివిన తర్వాత రచయితగా ఆయన గొప్పతనాన్ని ఇంత ఆలస్యంగా తెలుసుకున్నానా అని బాధ పడ్డాను.తెలుగులో బుచ్చి బాబు గారి చివరకు మిగిలేది నవలకు ఏమాత్రం తగ్గకుండా అంత గొప్ప స్థాయిలో ఉన్న పుస్తకం ఇది.
ఒక రచయితగా గొల్లపూడి గారు రాసినవన్నీ చదవాల్లన్న కోరికను నాలో బలంగా కలిగించిన నవల ఇది… ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం… దీనికి ఏమైనా అవార్డ్స్ వచ్చాయో లేదో నాకు తెలియదు కానీ ప్రతి తెలుగు వాడు చదివి ఈ పుస్తక రచయిత గొల్లపూడి గారు తెలుగువారు అని గర్వంగా చెప్పుకోవచ్చు.
చివరగా తెలుగు భాష మీద మమకారం ఉండి తెలుగు సాహిత్యాన్ని చదవాలి అనుకునేవారు దయచేసి పుస్తకాలు చదవడం మొదలుపెట్టండి… ఎందుకంటె ఇప్పటికే మీరు ఎన్నో గొప్ప రచనలను ఎందరో గొప్ప రచయితలను మిస్ అయ్యి ఉంటారు.
– అక్షరలిపి టీం