మహిళల పట్ల అన్యాయం…
వారి పట్ల జరిగే అన్యాయం పై రాసి రాసి ప్రతి అక్షరం కూడా ఏడ్చి ఏడ్చి అలసిపోయింది ఏమో…
అక్షరాలు కూడా ప్రజ్వలంగా రగులుతున్నయి ఏమో…
ఇక్కడ కేవలం రాయడం తప్ప మార్పు తీసుకరాలేని ఈ సమాజంలో అన్యాయం జరిగితే కొవ్వొత్తినై వస్తా కానీ అన్యాయాన్ని ఆపలేం…
పేద, ధనిక అనే తారతమ్యం తో న్యాయం చేస్తాం ఎందుకంటే
ఆ న్యాయ దేవత కూడా ఆడది కాబట్టి తన కళ్ళకి గంతలు కట్టి నిజాన్ని కనపడకుండా చేస్తాం…
ఇక్కడ ఎదుగుదల ఉంది పడుచు ప్రాయం హరించే స్థితి నుంచి పసిపాపాలని కూడా వదలని నికృష్ఠపు జీవనశైలిలో…
ఇది నా దేశం ఎక్కడైతే అన్యాయం జరిగిందో దాని గురించి మాట్లాడని పిరికి ప్రాణభయస్థులం…
ఆడతనమా నీకు నీవే రక్ష…
నీ అరుపు ఎవరికోసం ఎందుకు కోసం నిన్ను నువ్వు కాపాడుకో ఆడపిల్ల మానశరీరాలపై వ్యాపారం చేసే “అసలైన వ్యభిచారులు ఉన్న వ్యవస్థ”….
తన తనువు నొప్పి, ఉప్పైనై ఉప్పొంగే వేళా దానిని కూడా రాజకీయాలు చేసుకునే “సాని” కొంపల కుళ్ళిన ఆలోచనలు వ్యూహాలవ్యవస్థలో….
ఓ ఆడపిల్ల, ఓ పురిటి బిడ్డ, ఓ చిన్న పిల్ల, ఓ మగువ, ఓ మహిళ నీకోసం ఎవరు రారు,
ఎక్కడ న్యాయం జరగదు, ఎవరికోసం ఎదురు చూడకు నీకు నీవే రక్ష నీవే పోరాడు….
ఆడదానికి ఆడదే శత్రువు అనే స్థితి నుంచి ఆడదానికి ఆడదే ఆయుధంగా ఐక్యంగా అణుయుద్దం నీవై నీలో రగిలే ఉజ్వలాన్ని ఉప్పొంగించు…
మహిళల పట్ల న్యాయమా నీవెక్కడ???
అన్యాయమా నీ ఆయువు ఎంత ??
– సీతా మహాలక్ష్మి
Wow…. super poetry ..
Seetha maha Laxmi