మహిళ
‘ళ ‘ లోని కళ తో,
అట్లే మెలికలు తిరిగే పయనం తో,
సరళ భాష ఆభరణిఐ
పరిమళాలు పంచుతూ,
గుప్తతని పాతాళంలో ఉంచి ,
భాగస్తుని కి తాళం వేస్తూ,
రూపాయి బిళ్ళ ని తాళ్లతో బంధించి,
అడిగినదే తడవుగా విరాళం ఇచ్చి,
లోగిళ్లలో పళ్ళు కాయించి,,
కళ్ళు మసక బారిన పెద్ద కి కళ్ళజోడు గా మారి,
సంసారం పాళం తప్పిన,
గృహ సంకెళ్లను ఛేదించి,
నిలుచును గోళమందు కాళిఐ !!!
– వాసు