మహనీయుడు – అంబేద్కర్
జాతి నిర్మాత అంబేద్కర్
సమాజ రక్షకుడు అంబేద్కర్
అక్షర జ్ఞానం ఉన్న వాచస్పతి
మార్చేను బడుగుల బతుకుల గతి
స్వేచ్ఛ స్వాతంత్ర్యపు జీవితం ఆయన ఇచ్చిన వరం
దాని సాధనకై చేశాడు సమరం
ఆయన మనకోసం నడిచింది ముళ్లబాట
నేడు మన కది పూలబాట
అందుకే ఆ పేరు పలకాలి అందరి నోట.
ఆయన ఆశయం కనపడాలి ప్రతి చోట..
దేశం మెచ్చిన జనుడు
ప్రపంచం గుర్తించిన ఘనుడు
పీడిత ప్రజల ఆరాధ్య దేవుడు
సకల విజ్ఞానాన్ని గడించిన జ్ఞానుడు.
విశ్వాన్ని చుట్టి రాజ్యాంగాన్ని ఇచ్చిన వీరుడు
దళిత జన బాంధవుడు..
తరతరాలకు ఈయన మహనీయుడు..
కారణ జన్ముని జయంతి శుభాకాంక్షలతో.
జై భీమ్ 🙏🙏🙏
-కిరీటి పుత్ర రామకూరి