మహానగరంలో సామాన్యుడు
హైదరాబాద్ మహానగరం దేశానికే తలమానికంగా ఉంది. అలాంటి ఈ నగరంలో ప్రతి నిత్యం ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మన రచయితల్లాగా ప్రశాంతంగా కధలు వ్రాసి ఆనందించే వారూ ఉంటారు. అలాగే ఇతరుల కుత్తుకలు కోసే కసాయిలూ ఉంటారు. అలాంటి కసాయే మన ఈ కధా నాయకుడు సాయిలు కూడా. డబ్బు ఇస్తే ఎలాంటి పని అయినా చేసే సాయిలు వ్యక్తిగతంగా మంచివాడే.
ఈ సమాజం అతన్ని రౌడీగా మార్చింది. ఉదర పోషణార్ధం నగరానికి వచ్చిన సాయిలు మొదట్లో నోట్లో వేలుపెట్టినా కొరకలేనివాడు. అతనికి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిన ఈ సమాజం అంటే సాయిలుకి కసి. ఆ కసి ఎలా తీర్చుకోవాలో తెలీక హింసా మార్గం వైపు తన అడుగులు వేసాడు. తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్లు మొదట ఒక చిన్న రౌడీగా ఉండే సాయిలు తర్వాత ఒక పెద్ద డాన్ గా మారాడు. ఒకరోజు తన పక్కింటి వారు తన గురించి మాట్లాడిన మాటలను విన్న సాయిలుకి మనసు విరిగింది.
వారు సాయిలు నాశనం కోరుకుంటున్నారు. సాయిలు మరణించాలి అని వారు గట్టిగా కోరుకుంటున్నారు. నిజానికి సాయిలు వారికి ఎన్నో పనులు చేసిపెట్టాడు. ఐనా వారు తన గురించి ఇలా మాట్లాడటాన్ని వెంటనే సాయిలు ఇకపై రౌడీయిజం చేయకూడదు అని గట్టిగా భావించాడు. ఇకపైన బ్రతికినన్నాళ్ళు మంచి పనులు
చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. తన లాగా నగరంలోకి కొత్తగా వచ్చే వారు ఉండటానికి హాస్టల్ కట్టాడు.
నగరంలోకి కొత్తగా వచ్చేవారికి ఇక్కడ ఉండే ఉద్యోగ అవకాశాల గురించి వివరించే ఆఫీసు ఒకటి తెరిచారు. మంచి వాడు చెడ్డవాడిగా మారటం తేలిక. అదే చెడ్డవాడు మంచిగా మారటం ఒక అద్భుతం. అదే చేసాడు సాయలు. ఈ నగరం మంచివాళ్ళను ఆదరిస్తుంది అని చెప్పాలని సాయిలు తాపత్రయం.
– వెంకట భానుప్రసాద్ చలసాని
మనిషి సంఘజీవి కాబట్టి అందరితో మంచిగా ఉంటే బాగుంటుంది.