మహాకావ్యం
దుష్ట సంహారం
శిష్ట సంరక్షణం
ధర్మ సంస్థాపనం
రాజభోగాల తృణత్యాగం
అనుబంధాలలో ఆరాధ్య దీపం
మానవహిత ఆదర్శరూపం…శ్రీరామావతారం
సౌందర్య రాశి
సుగుణ శీలవతి
సహనకిరీటి జనకపుత్రి… జానకి స్వరూపం
అన్నదమ్ముల అనుబంధం
సేవాతత్పరత భావం
నిస్వార్ధ జీవితానికి నిదర్శనం… లక్ష్మయ్య లక్షణము
అఖండ బలశాలి
అణువణువులో రామభక్తి సీతాన్వేషణకు నమ్మినబంటు…
పవనసుత హనుమంతునిది
ధన్యమైన చరితం
ప్రతి పాత్రలో పరితపించును పరహితం
యుగాలు గడిచిన చెదరని ఇతిహాసం
ప్రతి ఒక్కరు తెల్సుకుని ఆచరించవల్సిన మహాకావ్యం….రామాయణం
శ్రీరామరక్ష…సర్వజగద్రక్ష
సీతారాముల పరిణయ మహోత్సవం
తిలకించండి తరించండి..
శ్రీ రామరామ రామేతి రమెరామే మనోరమే . సహస్రనామతత్తుల్యం రామనామ వరాననె .
-గురువర్ధన్ రెడ్డి