మధ్యతరగతి జీవి
మబ్బులు మనసులు
విహారాన్ని ఆపనంటాయి
మౌనం ఆలోచనను ఎగరేస్తే
మాట నిష్టూరాన్ని వదుల్చుకోలేకపోతుంది
పాట పరవశాన్ని చుట్టుకుంటే
అక్షరం సృజనలో ఇమిడిపోతుంది
ఆకలి అవమానాన్ని దిగమింగితే
అసమానత పోరాటాన్ని దించుతుంది
వైరుధ్యాలన్నీ లాగటం
మనిషికి కొత్తేమీ కాదు కానీ
సాగక కొన్ని,మనసాగక మరికొన్ని
మోహమాటపెడుతుంటాయి
ఉన్నవాడు ఉన్నది చాలక
లేనివాడు దారే తోచక
కలలకు పాలిష్ చేస్తుంటే
మొహందాచుకోలేని
మధ్య తరగతి జీవి మాత్రం
జీవితం నుంచి పారిపోతుంటాడు
– సి. యస్. రాంబాబు