మది మంత్రం
పువ్వులు వాడిపోవచ్చు
ఆకులు రాలిపోవచ్చు
చెట్టు ఎండి పోవచ్చు
కాలాలు మారవచ్చు
మనుషులు మారొచ్చు
గతాన్ని మరచి పోవచ్చు
రాత్రుళ్లు కదిలి పోవచ్చు
వెన్నెలలు,వేకువలెన్నో చూడొచ్చు
కానీ నీ మది గదిని మాత్రం
తెరచి చూడలేను, ఇన్నాళ్లు
ఎన్నేళ్ళు, ఏన్ని రాత్రుళ్ళు,ఏన్ని
పగల్లు,ఏన్ని గతాలు అయినా
మళ్ళీ పువ్వులు వికసించవచ్చు
ఆకులు చిగురించ వచ్చు,చెట్లు
కదలాడవచ్చు, కానీ నీ మనసు
కరగలేదా,నా మనసు తెలుసుకోలేదా
నా హృదయ భారం తగ్గలేదా
నీ మది మంత్రాన్ని తెలుసుకోలేదా…ప్రియా
ఎన్నాళ్లీ వేదన, ఎన్నేళ్ళు ఈ హృదయ రోదన
కాలం గడిచేకొద్దీ అన్ని కనుమరుగయ్యే వేళ
జ్ఞాపకాలు లేని గతాన్ని గుర్తుచేసుకోలేని
మనసేలా, రెండూ గోడల మధ్య జీవ్వచ్చవం లా
కలిసి చేసే కాపురమేలా.కదిలించని నీ హృదయాన్ని
కదిలించాలనే నా ప్రయత్నమంతా బూడిదలో పోసిన
పన్నిరేనా, నాకోసం ఒక్కసారైనా మారవా ప్రియా…
-భవ్యచారు
Chala chala bhagundhi 👌👌👌👌
చాలా బాగా రాసారు అక్క 👌👌👌👌👌👌👌👌👌👌👌