మాయా లో(మై)కం

మాయా లో(మై)కం

అర్థం చేసుకోవడం అంటే అపార్థం చేసుకొని దూషణలకు దిగడం ఈరోజు పరిపాటి అయింది. మనిషికి కావల్సింది ప్రేమ, ఆప్యాయత ఈ సత్యం తెల్సికూడా వీడి పరుగు ఎక్కడికి?

పై చదువులకి మా అబ్బాయి లేదా అమ్మాయి విదేశాలకు వెళ్ళారు. ఈ రోజుల్లో ముందుగా మన బంధువు నుండి వచ్చే స్పందన ఇది. ఎందుకీ, వెతలు, ఎందుకీ ఆయాసం?

ఒక ఆవిడ అంటుంది, “ఆ ఎంతకనీ చచ్చేది ? ఇప్పటి వరకు సాయం చేసి చేసి ఉన్నాము. తీసుకునే వారికి బుద్ధిలేకున్నా. ఇచ్చే మాకైనా ఉండాలిగా ?”

ఎదురు పడితే కుశల ప్రశ్నలు, వెనుదిరుగుతే వెక్కిరింతలు. ఈ వదులైన బంధాలు ఎప్పటికి పడును పీటముడి? 

ఇరుగు పొరుగు అంకుల్స్ మరియు ఆంటీలు వారి నిజాయితీ నిరూపించుకోడానికి నిత్యం కుస్తీ పడుతూ ఉంటారు. ఇంతకన్నా వేరే గొప్ప ఉదాహరణ ఉందా చెప్పడానికి ఒక వెకిలి చేష్ట ఒకాయన అంటాడు.

” నేను నిన్న చిల్లర లేకపోతే రెండు రూపాయలు తీసుకున్నాను థాంక్యూ సార్, ఇదిగో తీసుకోండి.” నిజాయితీ నిరూపణ పూరైంది.

ఇచ్చిన వాడనుకుంటాడు, “నిన్న పక్కాయనికి రెండు రూపాయలిచ్చాను. మళ్ళీ ఇస్తాడో, లేదో ? పోన్లే, వదులుకుందాం…” ఇది ఇంకో నిజాయితీ నిరూపణ.

ఎటుపోతున్నాము మనము? కొత్త ఒరువడులు వడి వడిగా నేర్చేసుకుంటున్నాము. వేదికలమయం అయ్యింది. ఇప్పుడు వర్తమానం.

అబ్బాయి ఆకలితో వస్తాడు. వాడికి ఏదైనా చేసి పెట్టాలి అన్న ఫికరు లేదు తల్లికి, కారణం భోజన వేదికలు. “ఆ, వాడా వస్తాడు, ఏదో ఒకటి ఆర్డరు చేసి తింటాడులే…! ఇదీ తల్లి వరుస. 

పది రూపాయల పట్టెడు తిండికి టాక్సులు, గట్రా, ఓ వంద ఖతం ఇంకో గొప్ప వేదిక ఉందండీ…! ఇంట్లో కూర్చుని, కూరగాయలు, ఇతరత్రా తెప్పించుకోవడం, అవి కుళ్ళినా, ముక్క వాసనొచ్చినా, భలే, భలే మనకి, ఇక్కడా, టాక్సు గట్రా మామూలే.

హలో, హలో, ఎవరండి మాట్లాడుతున్నది. ఎదుటి వ్యక్తి, “నమస్కారమండి ! నా పేరు మూర్తి ఆండీ ముంబాయి నుంచి మాట్లాడుతున్నాను. మీ అమ్మాయి ప్రొఫైల్ చూశాము,మా అబ్బాయి ఉన్నాడు. అందుకే కాల్ చేశాను.

ఈ కాల్ చేసిన వ్యక్తి ఇలా ఓ పది మందిని వరుసలో పెట్టుకుంటాడు. చివరికి మాఘమాసం వెళ్ళిపోతుంది, మౌనరాగమే గతి, ఇదో విచిత్ర, మాట్రిమోనీల వేదిక, ఇలా యింకా ఎన్నో…

“చదువులు” ఇప్పుడు చెప్పక్కర్లేదు. నాన్ ఫ్రాఫీట“బుల్” ఆర్గనైజేషన్స్, గొప్పటైటిల్ కదూ! వీరు పోషక దేవుళ్ళకి వీర భక్తులు, నటసామ్రాట్స్ వీరు, తల్లి, తండ్రులకి ఒక చీకటి గదిలో చంద్రుడ్ని, ఒక వెచ్చటి గదిలో సూర్యుడ్ని చూపిచ్చేస్తారు.

ఆరవ తరగతికి వారి అబ్బాయిని ఐ.ఏ.ఎస్., సి.ఏ. లను చేసేస్తారు. ఇంతకన్నా గొప్ప వేదన ఇంకేదైనా ఉందా ? అందరూ తెలివిగల వాళ్ళమని భావించి చేస్తున్న దిక్కుమాలిన తెలివి తక్కు పనులు ఇలా ఎన్నో…..

మారు. ఓ మనిషి. ని ఉచ్చ్వాస, నిచ్చ్వాసాలని నమ్ముకుని ముందుకు సాగు, రోజులో రెండు మంచి మాటలు, రెండు మంచి పనులు కుదరని పక్షంలో చక్కగా నవ్వు. నవ్వించు. ఒక మంచి మార్పుకి కారణమయ్యే దిశలో సాగిపో….

– వాసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *