మాటల మంత్రం
మాటలే మంత్రాలు చూపులే సూత్రాలు
అంటారు పెద్దలు
మాటల శక్తి చెప్పలేనిది
అద్భుతాలను సృష్టిస్థాయి
భావాలనుతెలుపుతాయి
మనిషి గౌరవాన్ని పెంచుతాయి
సంస్కారాన్ని
తెలియజేస్తాయి
హాస్యాన్ని పండిస్తాయి
చమత్కారాన్నికలిగిస్తాయి
మాధుర్యాన్ని
వలకబోస్తాయి
ప్రేమను కురిపిస్తాయి
కన్నీళ్లు తెప్పిస్తాయి
సమస్యలను సంధిస్తాయి
సలహాలుగా మారుతాయి
చిరునవ్వు ని చిందిస్తాయి
అసూయలను
పెంచుతాయి
ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి
ధైర్యాన్ని పెంచుతాయి
బాధల్ని మరిపింపజేస్తాయి
సంతృప్తిని కలిగిస్తాయి
అనుభవాలను తీసుకొస్తాయి
నమ్మకాలు కుదురుతాయి
మాటలయుద్ధాలు జరుగుతాయి
స్నేహాన్ని పెంచుతాయి
అనుభవాన్ని తీసుకొస్తాయి
ఆదర్శాలకు మూలమవుతాయి
అవకాశాలను
అందు కొస్తాయి
ఆలోచనలో పడేస్తాయి
సంతృప్తి కలగజేస్తాయి
ఆశీస్సులు గా మారుతాయి
అపార్ధాలకు ఆరంభమవుతాయి
విమర్శలుగా మిగులుతాయి
మాటల విన్నపమే జీవిత పరిష్కారం అవుతాయి
మాటలుమాయచేసి
జీవితానికి వన్నెలద్దుతాయి
పాఠాలు గుణపాఠాలు
నేర్పుతాయి
మంచిమాటలు మహా శక్తివంతంగా మారవచ్చు
ఎంతైనా మాటలు జాగ్రత్తగా పలకడమే మేలు…
– జి జయ