మాటల మంత్రాలు…
ఎన్నెన్నో మాటల మంత్రాలు ఈ సృష్టిలో..
కొన్ని గుండెని గుచ్చే తూటలైతే…
ఇంకొన్ని ఊరట నిచ్చే తామరలు..
ఇవి ఆప్తులై ఆదుకుంటాయి..
రగిలించే నిప్పు కణికలై యెదనుకోస్తాయి…
కొన్ని ధృడమైన బలాన్ని ఇచ్చి ధైర్యం చెపుతాయి..
ఇంకొన్ని బలహీన పరిచి క్షీణింపచేస్తాయి.
ఉత్తేజాన్ని కలిగించే ఉద్యమమై నడిపిస్తాయి..
ఉగ్రరూపం దాల్చి ఉనికిని చాటుతాయి..
స్పూర్తి నిచ్చే సూచనలు అవుతాయి ఓదార్పు పంచే అనురాగం అవుతాయి…
ప్రేమను అందించే పలకరింపు అవుతాయి అభిరుచులు తెలిపే అభిప్రాయాలు అవుతాయి..
ఉదయించే ఉషస్సు లా మారి కవ్విస్తాయి..
అస్తమించే కిరణంలా మదిని తొలుస్తాయి..
వీటికి అడ్డు, అదుపు, కొలమానం, కొలతలు లేని మాటల బాణాలు..
మనిషిని బతికించే మందులు..
మరణాన్ని సైతం రుచిచూపించే ఆయుధాలు..
బంధాలను కలిపే మనోహరాలు..
భావాలను తెలిపే మదిఉల్లసాలు…
బాధలను పెంచుకునే ఊరటలు.
జ్ఞాపకాలను తలుచుకునే తీపి మధురాలు…
ప్రపంచాన్ని గడగడలాడించే అణుబాంబు లేని వైరస్ లు…
లోకాన్ని పరమళింపచేసే సుగంధాలు కూడా
ఈ మాటల ప్రపంచం లో. వాయువై ఆయువు పోసే మమతల మాటలెన్నో .ఉరిలా మారి ఊపిరి తీసే మాటలెన్నో…
– సీత మహాలక్ష్మి