మానవత్వం బతికుందని…!!!

మానవత్వం బతికుందని…!!!

అధికార దుర్వినియోగమా…లేక
గర్వితనపు గణతంత్ర దేశమా…
లేక…మధమెక్కిన అహంకారపు
అఘాయిత్యమా నేటి నాగరీకులుగా
చేసే నవ్య నాగరికథకు సోపానమా…లేక
రాసుకొన్న చరిత్రలకు ఇది అవమానమా ఆలోచించుకోవాలి…

విధి బలియమైనది బతికిన కాలం
మాన ప్రాణాలకు నిలయమైనది…
పేదరికాన్ని అనుభవించే మతిస్థిమితం
లేని వారి రూపం… ప్రకృతి గుర్తించని
నిర్భాగ్యానికి అలుసైందని పోస్తున్న
వాడబ్భా అమ్మలు ఎవరి జులుం కు
గన్నదో ఆ గాడిద చిత్రాన్ని తెలియదు…

పురుడోసుకొన్న వాడమ్మ బాధలను
నిజాలు గప్పిన రహస్యాన్ని బొడ్డు
కోతతో తెంచినది నిజమైనా…అడగని
వాడి రూపం వెనకాల చిరునామాకు
ఎన్ని చీకటి రాత్రులకు వంచన
గావించబడినదో వాడికి చెప్పలేదు…

వారి వ్యవహారాలు చచ్చిన ప్రేతాత్మలై
రూపం కాలేక…చీకటి వేదికలపై
తమ అగచాట్లను కప్పుకొంటు
హృదయం పగిలిన నిస్సత్తువతో
లోకం వెచ్చధనాలకు దూరం అవుతు…
నియంత్రించ బడలేని కాలం తీర్పులైనా
మేము మనుషులమే అన్న వాస్తవాన్ని
మరిచిపోకండి…

గమనించు….
గుర్తించండి నిన్నెవరని అడగలేదు
ఎవరికి ఎవరుగాదనే ఎదమీటిన
విరహ వేదనను మౌనంగా
వింటున్నాము…సగటు మనిషిగా
బతికే విలాసాలు మాకొద్దు పేరు గాంచిన
ఈ మానవ లోకంలోమానవత్వం
బతికుందనే ఆశతో ఎండిన బతుకైనా
ఓదార్చు కొంటున్నాము…

– దేరంగుల భైరవ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *