మాధ్యమాలు

మాధ్యమాలు

రాజులు పాయె, రాజ్యాలు పాయె. మరి పాలన మాట ఏమిటి? కుదుపులకు నిద్రలేచిన నాయకుడు, ప్రతిపక్షాలను రెండు తిట్లు తిట్టేసి మళ్లీ నిద్రలోకి జారుకుంటాడు.

మరి దేశాలన్నీ ఎలా పాలించబడుతున్నాయి? రాజు రాణి; పతి, పత్ని అనే లింగ భేదాలు లేని ఆ పాలకునీ పేరేమిటి? అదే శక్తి. ఈ శక్తి దైవికమైనది కాదండి. ఈ శక్తినే నేను మాధ్యమాలు అంటాను.

మరి ఇవి వాటి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూన్నాయా? దీనికి సమాధానం లేదు అని చెప్పవచ్చు. ఇవి ఫాసిస్టు లాగా వ్యవహరిస్తున్నాయి.

చెడుకు పట్టాభిషేకం మరియు మంచికి భ్రష్టత్వం. మాధ్యమాలు కోట్లు ఎలా గడుస్తున్నాయి చెప్పండి? దీనికి సమాధానం చాలా సులువు అండి. ఎదుటి వారి లోని బలహీనతను బ్రహ్మాండంగా వాడేసుకోవడం.

మరి మంచి ఉన్నచోట బలహీనత ఎక్కడ ఉంటుంది? ఉండదు, ససేమిరా ఉండదు. కాబట్టి వీరికి మంచితో పని లేదు. దాన్ని నలుగురికి పంచాల్సిన అవసరం కూడా లేదు.

బెల్లం చుట్టూ ఈగల చందంగా వీరు ఇతరుల బలహీనత చుట్టూ చేరి సాధ్యమైన మేరకు మేసేస్తారు. మరి ఇవి ఎలా ఫాసిస్టులు అవుతాయి? ఇక్కడ ఒకటి రెండు విషయాలు చెప్తాను.

లేనిదానికి ప్రాధాన్యత కల్పించడం. ప్రాధాన్యత ఉన్న దాన్ని కనుమరుగు చేయడం వీరి సూత్రం. కరోనా కష్టకాలంలో నా దృష్టిలో పడిన ఒక రెండు మూడు విషయాలు ఇక్కడ చెప్తాను.

వాటిని చెప్పేముందు వాటి మూల సారాంశాన్ని స్పష్టం చేస్తాను. ఉదాహరణకి మంచి జామకాయలు అమ్ముకొని బ్రతికేస్తోంది అనుకోండి.

దాన్ని నిషేధించేసి చెడు దగ్గర ఉన్న గన్నేరుకాయల్ని మార్కెట్లోకి తెచ్చి ప్రాచుర్యాన్ని కల్పించడం. ఇలాంటి సంఘటనలు ఈ కరోనా గడ్డు కాలంలో చాలా జరిగాయి అండి.

ఈ మాధ్యమాలను వాడుకుని చాలా వ్యాపారాలు డబ్బును మూటగట్టుకున్నాయి. మిరియాలు కరోనాకు విరుగుడు అని ముందుగా ప్రచారం చేస్తారు.

కారణము ఓ కుబేరుడు తన మిరియాల ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవాలి. సొంటి కరోనా కి విరుగుడు చవన్ ప్రాశ్  కరోనా కి విరుగుడు అంటూ మాధ్యమాల ద్వారా మీరు విపరీతమైన ప్రచారం చేశారు.

ఇలా చిన్న వ్యాపారాలు అనే కాకుండా పెద్ద వ్యాపారాలను కూడా పెంచి పెద్ద చేయడంలో ఈ మాధ్యమాలు విలయతాండవం చేశాయి..

చివరిగా చెప్పేదేంటంటే, మంచికి ప్రచారం అవసరం లేదు. కాబట్టి చెడుకు మంచి అనే మాస్క్ ను వేయకండి.

సాధ్యమైనంత మేరకు చెడును బహిర్గతం చేయండి. ఇది ఇలా నిజంగానే జరిగితే శక్తి దేశాలు అన్నింటిని సుపరిపాలన చేస్తుంది.

– వాసు

0 Replies to “మాధ్యమాలు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *