మా విజయం.. అమ్మ కోసం..
మన తోటి జనం మనల్ని ఎప్పుడూ కిందకి లాగాలనే చూస్తూ ఉంటారు, ఎప్పటివరకైతే మన మీద మనకిని విశ్వాసం ఉంటుందో, అప్పటి వరకు పడము, ఇంకా పైకి ఎదుగుతాము – ఇది మా అమ్మ మాకు చెప్పింది.
దీనిని ఎప్పుడూ నేను గుర్తుపెట్టుకుని ఉంటూ, యు.పి.ఎస్.సి లో ర్యాంక్ సాధించాను. ఈ విషయానికి కారణం మా అమ్మ, చెల్లి పోత్సాహం – అని ప్రశ్నలు అడుగుతున్న విలేకర్లకి అమూల్య చెప్పుతూ ఉంది. మా అమ్మ చిన్నప్పటి నుండి నన్ను, మా చెల్లిని చాలా కష్టపడి చదివించింది. ఎన్నో ఉడుదుడులు వచ్చినా, మా అమ్మ తునక లేదు, బెనక లేదు. తనమీద తనకి ఉన్న నమ్మకంతో, దేవుని మీద భారం వేసి, ముందుకి అడుగులు వేస్తూ, మమ్మల్ని ప్రయోజకులను చేసింది.
మరొకరికి స్ఫూర్తిగా ఉండేలాగా చేసింది. చిన్నప్పుడు మేము అంత బాగా చదివే వాళ్లం కాదు, మా అమ్మ మాతో పాటు కూర్చొని, మాకు అర్ధం అయ్యేలాగా చెప్పి చదివించింది. మా అమ్మ, ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా చేస్తూ, ఇంటిపని, వంటపని చేసి, రాత్రికి మమ్మల్ని కూర్చొపెట్టి చదివించింది. ఫస్ట్ ర్యాంక్ రావాలి పాపలు అని చెప్పేది.
కాని మాకు ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ రాలేదు. అయినా మా అమ్మ ఎప్పుడూ నిరుత్సాహ పడలేదు, మమ్మల్ని పడనివ్వలేదు. కచ్చితంగా మీరు మంచి స్థానంలో ఉంటారు అని దీవించేది. మా పుట్టిన రోజులనైతే మా అమ్మకి ఉన్నంతలో చాలా గొప్పగా చేసేది. మాకు నచ్చినవన్నీ చేసి పెట్టేది. మా స్నేహితులను ఇంటికి పిలిచి వాళ్ళకి పలహారాలు చేసి ఇచ్చేది. మా స్నేహితులందరికీ మా అమ్మ అంటే చాలా ఇష్టం.
నా పదో తరగతి పరీక్ష రోజుల్లో పరీక్ష హాల్ కి వచ్చి భయపడకుండా జాగ్రత్తగా రాయి నాన్న అని చెప్పింది. మా అమ్మ దీవెనలతో నాకు 89% వచ్చింది. మా అమ్మకి ఆ మార్కులు చూడగానే కంటనిండా నీళ్లు వచ్చాయి. ఇలా మా ప్రతీ పరీక్షకి వచ్చి మాకు ధైర్యం చెప్పింది. అలా నా బి టెక్ అయ్యిపోయాక, నేను యు.పి.యస్.సి రాస్తాను అంటే వద్దు అని చెప్పకుండా నా ఇష్టాన్ని గౌరవించి అప్పు చేసి, డబ్బు తీసుకొని కోచింగ్ సెంటర్ లో నన్ను చేర్పించింది.
ఇప్పటికే నా చదువులకి, చెల్లి చదువులకి చాలా ఖర్చు అయినా మా అమ్మ ఎక్కడ తగ్గలేదు, మా ఆశయాలను, ఎప్పుడూ గౌరవించింది. కోచింగ్ పూర్తి అయిన పరీక్ష రాద్దాం అంటే 2020 కరోనా కల్లోళం మొదలైంది. లాక్డౌన్ పెట్టేశారు. ఇంటికి వచ్చేసాం, నా గమ్యానికి అడ్డుగోడ పడిందేమో అని అనుకున్నాను. కరోనా రోజుల్లో ఒక్కో రోజు గడపడం మరింత భయంగా మారింది. మా అమ్మ మాత్రం మనం జాగ్రత్తలు తీసుకుంటే, మనకి ఏమి కాదు – అని ధైర్యం చెప్పింది.
లాక్ డౌన్ తీసేసారు, ఇప్పుడు విజయం వైపు అడుగులు వేయడానికి బయలు దేరాను. ఇప్పటికే బి టెక్ అయ్యి మూడు ఏళ్లు అయింది, ఇంకెందుకు అరుణ (మా అమ్మ) పెళ్లి చేసేసేయ్ నీ పిల్లలకి, కావాలంటే వాళ్లు పెళ్లి చేసుకోనే చదువుకుంటారులే అని చెప్పేవారు.
కానీ మా పెద్ద అమ్మాయి ఖచ్చితంగా కలెక్టర్ అవుతది అని ఎంతో నమ్మకంతో చెప్పేది మా అమ్మ. వాళ్లు ఊరుకోకుండా అనూహ్యకి పెళ్లి చేసేయ్ అయితే నీకు ఒక భారం తీరుతుంది అని చెప్పేవాళ్ళు. మా అమ్మ వాళ్ల మీద కోప్పడేది. ఏం మాట్లాడుతున్నారు. నా పిల్లలు నాకు ఎప్పుడూ భారం కాదు. వాళ్లను కష్టపడి చదివించాను. ప్రయోజకులను చేస్తాను చూడండి అని చెప్పింది.
అనూహ్యకి (చెల్లెలు) డిగ్రి అయ్యిక, సాఫ్ట్వేర్ కోర్స్లు నేర్పించింది. అవి తెలియక పోయిన ఆన్లైన్లో లో చూసి, తెలిసిన వాళ్ళను అడిగి వాటన్నిటి తెలుసుకుంది. మా చెల్లి (అనూహ్య) చేత కొన్ని కంపెనీలకు అప్లై చేపించింది. ఇంటర్వ్యూకి పిలిచారు మా చెల్లిని, అమ్మ కూడా తోడుగా వెళ్ళింది హైదరాబాదుకి. ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపు మా అమ్మ దేవునికి ప్రార్థిస్తూనే ఉంది. దేవుని దయ వల్ల మా చెల్లికి జాబ్ వచ్చింది. మా అమ్మ కళ్ళల్లో తారలు మెరుసాయి. మా చెల్లిని దగ్గరికి తీసుకొని ముద్దాడింది.
ఈలోపు నా యు.పి.యస్.సి ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చాయి, పాస్ అయ్యాను. మా అమ్మ కళ్లలో ఆనందం కోసం చాలా కష్ట పడి చదివాను. మెయిన్స్ కూడా అయిపోయింది ఇంటర్వ్యూయ్ లిస్ట్లో నా పేరు ఉంది. ఇంకా ఒక్క అడుగు దూరం లోనే ఉన్నాను నా గమ్యానికి అని కొండంత ఆనందం వేసింది. మా అమ్మ నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లో చాలా సాయం చేసింది. ఎలా ఉండాలి?? ఎలా మాట్లాడాలి? అన్నీ నేర్పించింది. నేను ప్రిపేర్ అయ్యాను.
ఇంటర్వ్యూ ఫైనల్ ఫలితం రానే ఫైనల్ వచ్చింది. నా నంబర్ మొదటి సానంలో ఉండటం చూసి మా అమ్మ చాలా సంతోషించింది. అందరికి ఫోన్ చేసి మా పెద్ద పాప కలెక్టర్ అయ్యింది అని చెప్తూ ఉన్నప్పుడూ, మా అమ్మ కల్లలో సంతోషం, మాట్లలో ఆనందం చూసాక నా కష్టం అంతా ఈ ఆనందం ముందు చిన్నది అని అపించింది.
ఫైనల్ గా మీ విజయం గురించి మీరు ఏం చెప్తారు మేడం అని అమూల్యని అడుగుతాడు విలేకర్ – ఉలి దెబ్బలకు భయపడితే, శిల శిల్పం అవ్వదు. మా అమ్మే మా ధైర్మం, నమ్మకం, బలం. మా విజయం, మా అమ్మ కోసం ఇంతకన్నా ఏం చెప్తాను. ధన్యవాదాలు.
– కావూరి అమూల్య బ్లెస్సి