మా ఊరు

మా ఊరు

మా ఊరు వెళ్ళడానికి రైలులో ప్రయాణం చేయాలి. రైలు ప్రయాణం చేయాలంటే నాకు ఇష్టం. మా చిన్నతనంలో ప్రతి సంవత్సరం సెలవులకు వెళ్ళేవాళ్ళం. నాకు ఊరు అంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారింది. ప్రతిరోజు ఉదయాన్నే ఆడపిల్లల అందరం కలిసి చెరువుకు వెళ్ళేవాళ్ళం…

సరదాగా మాట్లాడుకుని ఒకరి మీద ఒకరం జోక్స్ వేసుకుని ఇలా వెళ్లిన దారిన వచ్చిన వారిని పలకరించుకొని చెరువు దగ్గరకు వెళ్లి సరదాగా ఈత కొట్టేవాళ్ళం.. చెరువు నుండి ఇంటికి వచ్చేటప్పుడు చిన్న బిందెతో నీళ్ళు తీసుకొని దారిలో ఒక దగ్గర తులసిమ్మ చెట్టుకి నీళ్ళు పోసి ఇంటికి వెళ్లిపోతాము.

అందరం కలిసి గంజి అన్నం తినేవాళ్ళం. మధ్యాహ్నం పూట అందరూ నిద్ర పోతున్న సమయంలో తూనీగాలను పట్టుకొని ఆడుకునేవాళ్ళం… కాసేపు ఆడుకునే తర్వాత పశువులు ఉండే సాల్లోకి వెళ్లి కూర్చునేవాళ్ళం అలా సాయంత్రం వరకు హాయి కబుర్లు జోక్స్ అన్ని చెప్పుకొని మంచిగా ఆడుకునే అక్కడే కూర్చొని ఉండేవాళ్ళు..

సాయంత్రం పూట టీ తాగేసి ఇంట్లో పనులను చేసుకునేవాళ్లం.. బయట కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం.. చిన్నపిల్లలు అందరూ రాత్రి 7 గంటల వరకు ఆడుకునేవాళ్ళు… నాకు మాత్రం సాయంత్రం అవ్వగానే మేడ మీదకు వెళ్ళి అక్కడ సూర్యాస్తమయం చూసేదాన్ని..

అప్పుడు కనిపించే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రతిస్పందిస్తూ ఉంటాను.. రాత్రి పూట బయట మంచాలు వేసుకొని ఆకాశంలో ఉన్న చుక్కలన్ని లెక్కపెట్టుతూ నిద్ర పోయేవాళ్ళం.. అప్పుడు పెళ్ళిళ్ళు అర్థరాత్రి సమయంలో జరిగేవి. తరువాత పాటలు పెట్టి ఊరేగించే వాళ్ళు ఆ సౌండ్ కి మెళుకువ వచ్చేది అందరం కలిసి ఆ ఊరేగింపు చూడడానికి వెళ్లే వాళ్ళం..

మా ఊరు పండుగలకు వెళ్ళిన నేను. మరి ఎప్పుడు ఊరు వెళ్ళే సందర్భం రాలేదు. సందర్భం వచ్చిన నా మనసు చంపుకొని ఇక్కడే ఉండిపోవలసి వచ్చింది.. ఆ క్షణం నా బాధ ఎవరికి చెప్పలేని పరిస్థితి.. నేను వెళ్లలేని పరిస్థితిలో ఉన్న అమ్మ వాళ్ళకి ఎక్కువ రోజులు దూరంగా ఉండలేను.. ఊరు మీద ఇంకా ఎక్కువ మమకారం పెంచుకున్నాను.. ఆనాటి రోజులు ఎప్పటికీ రావు. మర్చిపోలేని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గడిపేస్తున్నా..

– మాధవి కాళ్ళ

0 Replies to “మా ఊరు”

  1. మీ ఊరి గురించి బాగా వ్రాసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *