మా ఆయన కోపం

మా ఆయన కోపం

మా వారికి చాలా కోపం ఎక్కువ …నా పెళ్లయి వెళ్లాక మా మామ గారు నన్ను పక్కకు పిలిచి ..అమ్మా! జయా! ( జయా అంటే ఎవరనుకుంటున్నారా? నేనేనండి నా పేరు పెళ్లిలో కదరలేదని విజయ లక్ష్మి గామార్చారు దాన్ని భాగాలు భాగాల కింద పిలిచే వాళ్లు.

మా మామ జయ గా మా తోటి కోడలు విజయగా మా ఆడపడుచు లక్ష్మిగా అలా అన్నమాట పేరు కష్టాలు మళ్లీ ఎప్పుడయినా రాస్తాను ప్రతిలిపిలో రాసా కూడా )
మా వాడు దుర్వాస మహాముని వాడికి కోపం ఎక్కువనువ్వే సర్థుకు పోవాలి ఆ కోపం క్షణకాలమే తల్లీ! నువ్వా క్షణం ఓపిక పట్టాలి అన్నారు..

నన్ను చాలా గారాబంగా పెంచారు చిన్న మాట కూడా ఎవరూ అనరు ఎలా ఉండాలో! ఏంటో! అనుకున్నా!తరువాత మా అత్తగారు కూడా అదే విషయం చెప్పిచిన్నప్పుడు ఘోర్జ్యం పోసాను అది పోస్తే కోపం ఎక్కువవస పోస్తే వదురుతారు ఇది పోస్తే కోపం ఉంటుంది అన్నారు..

మా మామగారేమెా! వాడు చాలా ఉత్తముడు ఉత్తముని కోపం క్షణకాలం అన్నారు..ఇక నేనైతే ఆ కోపాన్ని భరిస్తూ ముఫ్పై మూడు సంవత్సరాలు గడిపాను ఇంకా భరించే ఓపిక నాకున్నా
దేవుడికే లేదేమెా! తనని తీసుకు పోయాడు.కానీ చెప్పగా చెప్పగా కొంత కోపాన్ని తగ్గించు కుంటున్నారు కానీ అలా జరిగి పోయింది…

ఆ కోపం తగ్గించుకుంటె జీవితం మూడు పువ్వులు ఆరు కాయలే!తగ్గించుకోక పోతే పాట్నర్ కయినా ఓపిక ఉండాలివివాహ బంధానికి విలువిస్తే ఆ ఇద్దరి జీవితాలు బాగుంటాయి…
అని నా అభిప్రాయం మాత్రమే సుమండీ!!

అదండీ మా ఆయన కోపం స్టోరీ!

-ఉమాదేవి ఎర్రం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *