లేత పిడికిళ్ళు!!
ప్రకృతి వాంఛలకు
తల ఒగ్గి…………..
నెత్తి నెత్తిన బరువు
భారమయ్యే ను బ్రతుకుల కి!
మోసె బెడ్డను
కూలి చేసి……!
కాసిన బిడ్డకు గర్భమున
కష్టం అంటే తెలిసెను దానికి
ఇట్లు అయ్యె అన్నప్రాసన
గర్భగృహమున………….!
తల్లి భారము దిగనిది
భూతల్లి ఒడి బరువు తగ్గనిది .
ఇరువురైరి తల్లులు,
ఇరుకు పెరిగెను బరువు తో……..!
అవలీలగా బరువులెత్తే ఆ తల్లికి
బిడ్డ దాయ మోత బరువు.
తల్లి ఎంగిలి తిన్న ఆ నలుసు,
మోసె కంకర పిడికిళ్లతో .
స్వేదము చిందంగ
ఉప్పందించె నా తల్లికి
ఆ పాపం ఎరుగని పసిపాప….!
– వాసు